
తమిళనాడులో టీవీకే పార్టీ తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకున్నప్పుడు మీడియా, రాజకీయ విశ్లేషకులు, ప్రజల స్పందన ఒక విధంగా ఉంది. ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం రెండే రెండు సీట్లు గెలుచుకున్న వీసీకే పార్టీని విజయ్ బ్రతిమాలుకుంటున్నప్పుడు అందరి స్పందన మరొకలాగ ఉంది.
ప్రజల, అభిమానుల అభిమానాన్ని విజయ్ ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో సఫలం అయ్యారని, గవర్నర్ బ్రేకులు వేయకపోయుంటే ఇదే ఊపులో సిఎంగా ప్రమాణస్వీకారం కూడా చేసి ఉండేవారని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అంతా తారుమారవడంతో విజయ్, గవర్నర్ వైఖరిని తప్పుపట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అయితే ఎన్నికలకు ముందు బిజేపి ఎంత ఒత్తిడి చేసినా పొత్తుల విషయంలో విజయ్ చాలా స్థిరంగా ఉన్నట్లే, ప్రభుత్వ ఏర్పాటుకి ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా విజయ్ ధైర్యంగా నిలబడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే-బిజేపి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 5 ఏళ్ళు నిశ్చింతగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఉండగా, రెండు సీట్ల కోసం వీసీకే పార్టీని విజయ్ ప్రాధేయపడటం అవసరమా?
కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వీసీకే వంటి పార్టీలు ఇప్పుడే ఇంత డ్రామా ఆడుతున్నప్పుడు, రేపు అధికారంలోకి వచ్చాక ఊరుకుంటాయా? ముఖ్యంగా ఇది బొటాబొటి మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వమని తెలిసినప్పుడు సొంత పార్టీ, మద్దతు ఇస్తున్న పార్టీలలో ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేయకుండా ఉంటారా?దేశ ముదురు డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బిజేపిలు విజయ్‌ని ఊపిరి తీసుకోనిస్తాయా?
టీవీకే-118-ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా అధికారంలో ఉండగలదా? ఉండలేకపోతే విజయ్ పరిస్థితి ఏమిటి?ఉండాలేదని తెలిసి ఉన్నప్పుడు ఇన్ని తిప్పలు పడటం అవసరమా? వంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు లభిస్తాయి.
కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, టీవీకే పార్టీ ఎన్నికల బరిలో దిగి 108 సీట్లు గెలుచుకోవడం మొదలు నేటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ, ముఖ్యమంత్రినవుతానని చెప్పుకుంటున్న కల్వకుంట్ల కవిత వంటివారికి, అలాగే ప్రాంతీయ పార్టీలకు కూడా వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి.
భవిష్యత్‌లో మనకీ ఇలాంటి పరిస్థితులే ఎదురైతే వాటిని ఏవిధంగా ఎదుర్కొంటే మంచిది? ఎలాంటి తప్పులు చేస్తే కొంప మునుగుతుంది? వంటి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…