Telugu

అన్నీ ఉన్నా తినడానికి కంచం లేదంట..!

ఇటీవల ప్రారంభమైన విజయ్ హజారే ట్రోఫీ అభిమానులను భారీ స్థాయిలో తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ టోర్నీ కు ఎన్నడూ లేని వైభవం ఈసారే ఎందుకు అంటే, ఇంటెర్నేష్నల్ ఒక్కటే కాదని, లోకల్ టోర్నీ లలో కూడా పాలుపంచుకునేందుకు దిగి వచ్చిన ‘విరాట్, రోహిత్’ ల వల్ల నేడు ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ గా నిలిచింది.

ఈ టోర్నీ కు ఇంత ఫేమ్ వచ్చింది రో-కో ల వల్లే గాని, టోర్నీ లోని ఇతర ఆటగాళ్లు తామేమి తక్కువ కాదు అనే రీతిలో చెలరేగి బ్యాటింగ్ చేసారు. నిన్న ఒక్కరోజే మొత్తంగా 16 మ్యాచ్లు నిర్వహించిన ఈ టోర్నీ లో ఒక్క మ్యాచ్ కు కూడా అఫీషియల్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వలేదు.

ADVERTISEMENT

టోర్నీ మొదలయ్యే ముందు రోజు వరుకు సందిగ్ధంలోనే ఉన్న ఈ లైవ్ స్ట్రీమింగ్ టాపిక్ కు చివరి నిమిషాల్లో స్ట్రీమింగ్ లేదనే విషయం బయటకి రాగా, భారీ స్థాయిలో అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసుకున్నారు. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు వన్-డే ఇంటెర్నేష్నల్ ర్యాంకింగ్ లో 1,2 గా ఉన్న ఇద్దరు బ్యాటర్స్ దేశవాళీ టోర్నీలో పాలుపంచుకుంటుంటే, ప్రసారం చేసేందుకు ఇబ్బందులేంటి అనే ప్రశ్న అందరి నోటా వెల్లువెత్తాయి.

టోర్నీ కే హైలైట్ గా నిలిచిన రో-కో లు తమను వన్-డే గ్రేట్స్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఫార్మాట్ లో వారికింకా ఆయుష్షు మిగిలే ఉంది అనే స్పష్టమైన సంకేతాలిస్తునే ఈ సీనియర్ జోడి చేరికొక సెంచరీ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ టోర్నీ అభిమానులను ఇంతలా ఆకర్షించడానికి కారణం రో -కో లే అయినప్పటికీ నిన్న జరిగిన మ్యాచ్లలో కొంతమంది ఆటగాళ్ళ ప్రదర్శన చూస్తే వీరిద్దరే అవాక్ అవ్వక తప్పదు.

ప్రస్తుతం నేషనల్ వైడ్ సెన్సేషన్ గా మారిన 14 ఏళ్ళ కుర్రోడు ‘వైభవ్ సూర్యవంశీ’ కళ్ళు చెదిరే బ్యాటింగ్ తో 36 బంతుల్లోనే సెంచరీ ను అందుకుని, ఆ పై రెచ్చిపోయి ఏకంగా 190 పరుగులు చేసి తాను ఎందుకు ఒక ప్రత్యేక బ్యాటర్ అని మరలా రుజువు చేసుకున్నాడు.

అదే జట్టులో ఆయుష్ మరియు సాకిబుల్ సెన్సేషనల్ 100s తో బీహార్ జట్టు స్కోరును కళ్ళు చెదిరే 574 గా నిలబెట్టి, మ్యాచ్ ను 397 పరుగుల తేడాతో గెలుపొంది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే మ్యాచ్లో భాగమయ్యారు.

అదే రీతిలో ఇటీవలే విడుదల చేసిన టి-20 వరల్డ్ కప్ తుది స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ కలలో కూడా ఊహించుకోలేని బ్యాటింగ్ తో 125 పరుగులను కేవలం 39 బంతుల్లో అందుకున్నాడు. ఈ బ్యాటర్ విధ్వంసానికి ఝార్ఖండ్ 412 స్కోర్ చేసి కర్ణాటక కు 413 పరుగుల టార్గెట్ ను సవాల్ చేసింది.

ఆ ఇన్నింగ్స్ బ్రేక్ లో కర్ణాటక బ్యాటర్లకు ఏమిచ్చారో ఏమో గాని, కర్ణాటక కు చెందిన దేవదత్ పాడిక్కల్ విజయ్ హాజరే ట్రోఫీ చరిత్రలోనే అత్యంత భారీ స్కోరును చేజ్ చేసిన జట్టుగా కర్ణాటక ను నిలబెట్టాడు. ఝార్ఖండ్ విధించిన 413 పరుగులను 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించేశారు.

ఎంత గొప్ప నైపుణ్యం ఉన్నా, ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించినా, ఆ ఫుటేజ్ బయట ప్రేక్షకుల వద్దకు వెళ్లకుంటే, దాని ఉపయోగమేమి? అఫీషియల్ గా స్ట్రీమింగ్ లేకున్నా సరిపెట్టుకున్న ఫాన్స్ కోసం ఒక ప్రేక్షకుడు జైపూర్ లో ముంబై మ్యాచ్ ను యూట్యూబ్ లో లైవ్ ఇవ్వటంతో అతనిపై స్ట్రైక్స్ వేసి, ఆ ఛానల్ ను సీజ్ చేసింది యాజమాన్యం.

జట్టు యాజమాన్యం నుండి వచ్చిన ఈ చర్య అభిమానులను ఇంకా రగిలింపజేసింది. ఒక పక్క చూసేందుకు ఆట, వారి ఆటలో వేట, ఇలా అన్నీ అందుబాటులో ఉన్న క్రికెట్ అభిమానులకు తినడానికి కంచము లేనట్టు, చూడటానికి స్ట్రీమింగ్ లేక ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. మరి కనీసం రేపు జరిగే సెట్ కైనా బోర్డు స్ట్రీమింగ్ అందజేస్తుందా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

3 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

5 hours ago