
విద్యార్ధులు లెక్కల క్లాసులో లేదా పరీక్షలో ‘ఫైనల్ ఆన్సర్’ తీసుకు వచ్చేందుకు పైన లెక్కలు కిట్టిస్తుంటారు. అదేవిధంగా తమిళనాడులో 108 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ 118కి పది సీట్ల దూరంలో ఉండిపోయిన టీవీకే పార్టీ కూడా ఆ నంబర్ కిట్టించడం కోసం పాపం చాలా కష్టపడింది.
కానీ గవర్నర్ ఆ లెక్కలు సరికావని, సరిగ్గా ‘118 ఆన్సర్’ వచ్చేలా రాసుకొని రమ్మనమని రెండు సార్లు తిప్పి పంపిచేశారు.
దీంతో టీవీకే పార్టీ నేతలు మళ్ళీ గురువారం రాత్రి మేధోమధనం చేసి వీసీకే పార్టీ, వామపక్షాల నుంచి చెరో రెండు చొప్పున ఆరు సీట్లు, కాంగ్రెస్ పార్టీవి 5 సీట్లు కలుపుకొని టోటల్ 108+6+5=119 సెట్ చేశారు. మూడు పార్టీలు టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తూ లేఖలు అందించాయి.
విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. కనుక వాటిలో ఒక సీటుకి రాజీనామా చేస్తే గవర్నర్ చెప్పిన ఆన్సర్ 118తో సరిగ్గా ట్యాలీ అయ్యింది.
కనుక విజయ్ ఆ లెక్కల కాగితం పట్టుకొని మళ్ళీ ఈరోజు సాయంత్రం గవర్నర్ ఆర్లేకర్‌ని కలవబోతున్నారు. గవర్నర్ కూడా అందుకు సిద్దంగానే ఉన్నారు కనుక విజయ్‌కి ‘పాస్ మార్కులు’ వేసి సంతకం పెట్టేస్తే రేపు అట్టహాసంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ‘విజయ్ అనే నేను…’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయవచ్చు… చివరి నిమిషంలో మళ్ళీ ఏ మెలిక లేకపోతే!
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…
Madhuri Jain gives traditional saree styling a moody, modern pulse in this striking photoshoot. Draped…