Telugu

సాయిరెడ్డి టార్గెట్ సజ్జలా.? జగనా.?

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన మాజీ పార్టీ తో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో పూర్తిగా రాజకీయ శత్రుత్వం పెట్టుకోదలచారా.? లేదా తానూ వైసీపీ పార్టీకి దూరం అవ్వడానికి, జగన్ నుంచి దూరం జరగడానికి ముఖ్య కారణమైన కోటరీ మీద రాజకీయ శత్రుత్వం కొనసాగించదలచారా.?

తన కొత్త పార్టీ ఏర్పాటు అంటూ సాయిరెడ్డి చేస్తున్న ప్రీ రాజకీయం గమనిస్తే తన పార్టీ ఆవిర్భావానికి ముందే వైసీపీ పార్టీని ప్రజలలో వీలైనంత పలుచన చేయాలనుకుంటున్నారు అనే భావన కలుగుతుంది. అందులో భాగంగానే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిల శాతం అనూహ్యంగా పెరిగిందని దీని వెనుక జగన్ ప్రోత్సాహం ఉందంటూ వైసీపీ మీద మత బాంబ్ వేశారు.

ADVERTISEMENT

అలాగే వైసీపీ పార్టీ అధికార అధినేత హోదాలో వైఎస్ జగన్ ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వైఎస్ జగన్ నెంబర్ – 2 అంటూ పార్టీ నెంబర్ – 1 స్థానాన్ని మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి ఖాతాలో వేశారు. వైసీపీ పార్టీ లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా సజ్జల ఆదేశాలతోనే, సజ్జల ఆధ్వర్యంలోనే నడుస్తుందని,

చివరికి పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న జగన్ ను సైతం సజ్జల కంట్రోల్ లోనే ఉంటారంటూ సజ్జల స్థాయిని పెంచుతూ జగన్ స్థానాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవి కి రాజీనామా చేసిన తరువాత ఆ పదవి చేపట్టిన జగన్ కేవలం ఆ గౌరవ అధ్యక్ష పదవికి మాత్రమే పరిమితం అయ్యారంటూ జగన్ ను సజ్జల పపేట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు.

ఇక తాజాగా నిన్న తాడేపల్లి ప్యాలస్ లో సిపిఐ నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్ తో పాటుగా సజ్జల కూడా పాల్గొన్నారు. ఈ విషయమై సాయిరెడ్డి తన X వేదికగా స్పందించారు. వైసీపీ, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమిలో ఉన్న సిపిఐ తో కలిసి ప్రజా సమస్యల పై ఉమ్మడి పోరాటం చేయడానికి సిద్ధమయ్యాయంటూ సాక్షి పత్రికలో ప్రకటించారు.

పార్టీ అధ్యక్షుడి కన్నా ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్ గారు, తన మాజీ పార్టీ తో జరిపించిన ఒప్పందం వల్ల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వైసీపీ శ్రేణుల ఆలోచనలకే వదిలేస్తున్నా అంటూ ఈ మొత్తం పోస్ట్ సజ్జల టార్గెట్ గా ముందుకెళ్లింది.

ఈ ఇరు పార్టీ నేతల భేటీ సందర్భంగా సాక్షి ముద్రించిన ఈ ఫోటోలో జగన్ కన్నా సజ్జల కూర్చున్న కుర్చీ కాస్త ఎత్తులో ఉండడంతో పార్టీలో జగన్ కన్నా సజ్జల దే పై చేయి అనే అర్ధం వచ్చేలా సాయిరెడ్డి సజ్జలను టార్గెట్ చేసారు. దీనితో అసలు విజయసాయి రెడ్డి పొలిటికల్ టార్గెట్ జగనా.? లేదా సజ్జలా.? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సకల అవలక్షణాలతో దేశాభివృద్ధి ఎలా?

ఒకప్పుడు.. అంటే సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక పెద్దగా పట్టించుకునేవి…

11 minutes ago

Pics: Neha Shetty Serves Fresh Denim Style With Attitude

Neha Shetty brings a fresh fashion spark to this denim focused gallery, blending relaxed glamour…

21 minutes ago