
YSRCP faces fresh religion claims debate
నాడు ఏపీ రాజకీయాలలోకి షర్మిల ఎంట్రీ జగన్ మరో ఛాన్స్ కి ఎలా అయితే గండి కొట్టిందో, అలానే నేడు సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు అందుకు జరుగుతున్న ముందస్తు రాజకీయం జగన్ 2.0 ఆశలను ఆవిరి చేయనుందా.? అన్న ప్రశ్న లేవనెత్తుతుంది.
కొన్ని దశాబ్దాలుగా జగన్ నీడలా, వైసీపీ రాజకీయ బలంగా నిలబడిన సాయిరెడ్డి వైసీపీ కి వ్యతిరేకంగా జగన్ ను ఇరుకునపెట్టేలా తాజాగా చేస్తున్న కొన్ని ప్రకటనలు వైసీపీ కి దీర్ఘకాలంలో రాజకీయ ఎదురుదెబ్బగా మారే ప్రమాదం లేకపోలేదు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మతమార్పిడులు, వైసీపీ పార్టీలో ఊపందుకున్న మతమార్పిడి ఒత్తిడ్లు అంటూ సాయిరెడ్డి చేస్తున్న ప్రకటనలు అందుకు ఆయన చూపిస్తున్న కొన్ని ఆధారాలు హిందూ సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.
విజయసాయిరెడ్డి తన X వేదిక గా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైసీపీ ని ఆత్మరక్షణలో పడేసినట్టయ్యింది. గతంలో వైసీపీ పార్టీలో ఎంతోమంది నాయకులు తమ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి పదవుల కోసం జగన్ గారిని ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నెంబర్ వన్ గా ఉన్నవారు జవాబు చెప్పాలంటూ,
వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో చేసిన ఒక ప్రసంగాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు సాయిరెడ్డి. ఒక క్రైస్తవుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అనేది ఇక్కడున్న పాస్టర్లందరికి తెలుసు అంటూ ఒక క్రైస్తవ సభలో ద్వారంపూడి చేసిన ప్రసంగాన్ని పంచుకున్నారు సాయి.
అయితే వైసీపీ పార్టీలో అంతర్గతంగా జరిగిన, జరుగుతున్న రాజకీయాలను ఇలా సాయిరెడ్డి తన లీకులతో బయటకు తెస్తూ వైసీపీ పార్టీని ఒక మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా.? వైసీపీ కి మతం ముద్ర వేస్తున్నారా.? ఆనం చర్చ జరుగుతుంది. వైసీపీ కి సాయిరెడ్డి వేస్తున్న ఈ మతం ముద్ర రానున్న రోజులలో వైసీపీ ని రాజకీయంగా ఇరకాటం పెట్టక మానదు.
ఇప్పటికే వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మత మార్పిడి చేసుకున్నారంటూ ఆయన కోడలు మేఘన చేసిన ఆరోపణలు అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియకపోవడం వైసీపీ ని ఇరుకున పెట్టగా, ఇప్పుడు సాయి రెడ్డి చేస్తున్న తాజా ప్రకటనలు, అందుకు ఆయన చూపిస్తున్న వీడియోలు వైసీపీ పార్టీని ఒక మతానికి పరిమితం చేసేలా కనిపిస్తున్నాయి.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హాయంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు, అందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు, తీసుకున్న చర్యలు, తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో వెలుగులోకి వచ్చిన కల్తీ ఆరోపణలు ఇవన్నీ కలిపి వైసీపీ పట్ల హిందూ సమాజం మీమాసంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
సాయిరెడ్డి వైసీపీ టార్గెట్ గా జగన్ ను ఇరుకునపెట్టేలా చేస్తున్న ఈ ఆరోపణలకు, విమర్శలకు వైసీపీ తక్షణమే చెక్ పెట్టకుంటే వైసీపీ రాజకీయంగా మరో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Rashmika Mandanna is back on the sets after a long break caused by her hip…
The skies turn dark in the teaser of Aasmaan, setting up a mysterious thriller. Starring…