
మంగళవారం ఆయన హడావుడిగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, దసపల్లా భూములు, రామోజీ, ఈనాడు గురించి మాట్లాడుతూ పనిలో పనిగా తనకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రస్తావన కూడా చేయడం గమనార్హం.
విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం వద్ద హయగ్రీవ వెంచర్లో డెవలపర్ 99 శాతం వాటా తీసుకొని భూమి యజమానికి కేవలం ఒక్క శాతం మాత్రమే ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా ఈవిదంగా ఒప్పందం జరగలేదని, దీనిపై విచారణ జరపాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వామి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ!
సొంత ఎంపీ భూయజమానిని మోసం చేశాడన్నట్లు విజయసాయి రెడ్డి మాట్లాడటం గమనిస్తే వారిరువురి మద్య విభేధాలున్నాయని, విశాఖలో విజయసాయి రెడ్డికి ఎంవివి సత్యనారాయణే ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈనాడుకు పోటీగా తాను కూడా ఓ మీడియాను ఏర్పాటు చేస్తానని రామోజీకి సవాలు విసిరినట్లుగానే విజయసాయి రెడ్డి పనిగట్టుకొని విశాఖకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి మరీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్లు భావించవచ్చు.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…