
విజయ్ TVK విజయం తమిళనాడు రాజకీయాలలో కొత్త చరిత్రను సృష్టించాయని భావించిన తరుణంలో తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విజయ్ పొలిటికల్ గా వేస్తున్న తొలి అడుగులను తమిళనాడు ప్రజలతో పాటుగా యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన విజయ్ అటు పిమ్మట మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. దీనితో తమిళ రాజకీయాలలో విజయ్ కొత్త తరహా రాజకీయం మొదలుపెట్టారు అంటూ సీఎం గా విజయ్ వేసిన తొలి అడుగు పై ప్రశంసలు కురిసాయి.
ఇక అలాగే ప్రార్ధనా మందిరాలు, స్కూల్స్, బస్సు స్టాండ్ కి 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలన్నీ రెండు వారాల లోపు మూసేయాలంటూ సీఎం గా విజయ్ తీసుకున్న తొలి నిర్ణయం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తమయింది. ఇక నేడు తన వ్యక్తిగత జోతిష్యుడైన రిక్కీ రాధన్ పండిట్ ని సీఎం ఓఎస్డీ గా నియమించ్చినట్లు టీవీకే ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది.
అయితే ఒక జోతిష్యుడికీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన పదవి, క్యాబినేట్ హోదా కల్పించడంతో అది అధికార దుర్వినియోగమే అవుతుందంటూ అప్పుడే విజయ్ పై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ నిశ్శబ్దం మీద కూడా సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.
అసెంబ్లీ సాక్షి గా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కులాలుగా, మతాలుగా ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్నీ నిర్ములించాల్సిన అవసరం ఉందంటూ ఉదయనిధి స్టాలిన్ CM విజయ్ కు సూచించగా అందుకు విజయ్ నవ్వుతు స్టాలిన్ కి నమస్కారం చేసి సైలెంట్ అయిపోయారు.
అయితే ప్రతిపక్ష నేత అసెంబ్లీ సాక్షిగా ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించినప్పటికీ ముఖ్యమంత్రిగా విజయ్ అలా నిశ్శబ్దంగా ఉండిపోవడం పై కూడా విజయ్ పై విమర్శలు మొదలయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలే ఒక క్రిస్టియన్ మతం మీద కానీ ఒక ముస్లిం మతం మీద కానీ చేసి ఉంటే విజయ్ ఇలానే మౌనంగా ఉండిపోయేవారేనా.? అంటూ విజయ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి.
తమిళ ప్రజలు డీఎంకే పార్టీని, ఆ పార్టీ సీఎం నేత స్టాలిన్ ని ఓడించినా ఉదయనిధి స్టాలిన్ కి ఇంకా అహంకారం తగ్గలేదని, ఇప్పటికి సనాతన ధర్మం మీద అనవసరంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారంటూ ఉదయనిధి పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గట్టిగానే సాగుతుంది.
అయితే విజయ్ సీఎం గా తీసుకున్న ఒక నిర్ణయం, పాటించిన ఒక మౌనం రెండు కూడా ఆయన వేసిన తొలి అడుగులే కావడం, ఆ అడుగుల పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తొలి పొలిటికల్ అడుగులు తప్పటడుగులుగా మారబోతున్నాయా.? అన్న చర్చ మొదలయ్యింది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…