
కోలీవుడ్ అగ్రనటుడు విజయ్ దళపతి కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి తమిళనాడు రాజకీయాలలోకి ప్రవేశించడమే ఓ సంచలనం.
ఆ తర్వాత జన నాయకుడు సినిమా సెన్సార్ గొడవతో సహా అనేక సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్-మే నెలలో జరుగబోయే శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటూనే ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.
ఇన్ని సమస్యలు, ఒత్తిళ్ళ మద్య భార్య సంగీత ఇటీవల విడాకులు నోటీస్ ఇచ్చారు. సినీ పరిశ్రమలో ఓ హీరోయిన్‌తో సంబంధం పెట్టుకునందుకేనట! ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి త్రిష అని తమిళనాడు బిజేపి అధ్యక్షుడు నాగేంద్రన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
వెంటనే త్రిష తీవ్రంగా స్పందిస్తూ తన పేరుని రాజకీయాలలోకి లాగితే సహించనంటూ లీగల్ నోటీస్ ఇచ్చారు. వీటన్నిటిపై ఇంటా, బయటా ఇంకా రచ్చరచ్చవుతుండగానే విజయ్-త్రిష కలిసి నిన్న చెన్నైలో ఓ నిర్మాత కొడుకు పెళ్ళికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు!
తద్వారా భార్య సంగీత చేస్తున్న ఆరోపణ, మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిజమేనని వారిరువురూ స్వయంగా ధ్రువీకరించినట్లయింది.
మళ్ళీ దీనిపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వాటి సారాంశం క్లుప్తంగా…
1. విజయ్-సంగీత చాలా కాలం నుంచే దూరంగా ఉంటున్నారు. త్రిషతో విజయ్ వైవాహికేతర సంబంధం కొత్త విషయం కాదు.
2. విజయ్-సంగీత విడిపోవడం వారి వ్యక్తిగత విషయం. దానిపై ఎవరి తీర్పులు అవసరం లేదు.
3. కొడుకు కూడా తండ్రిని అన్ ఫాలో చేసి అసహ్యించుకుంటున్నాడు కదా?
4. విజయ్ భార్యకు భరణంగా రూ.250 కోట్లు ఆఫర్ చేశారు. వారికి న్యాయం చేస్తున్నట్లే కదా?
5. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి కాలం నుంచే ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయి. ద్రవిడ రాజకీయాలలో ఇలాంటివి మామూలే. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
6. విజయ్ ద్రవిడ రాజకీయాలలో ప్రవేశించి రాణించాలనుకున్తున్నారు కనుకనే పెద్దలను ఫాలా అవుతూ త్రిషతో జత కట్టారు.
7. ఈ ‘ట్రేడ్ మార్క్’ రాజకీయాలలో భాగంగానే సరిగ్గా ఎన్నికలకు ముందు విజయ్ భార్యతో డైవోర్స్ తీసుకుంటున్నారు. ఇలా త్రిషతో పబ్లిక్‌గా తిరగడం మొదలుపెట్టారు.
8. దీంతో విజయ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. విజయ్-త్రిష కాంబినేషన్‌తో టివికే పార్టీకి ఫ్రీగా పబ్లిసిటీ లభిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ త్రిషతో విజయ్ బహిరంగంగా బయటకు వచ్చిన తర్వాత కూడా అభిమానులు తగ్గేదేలే అంటూ అండగా నిలబడుతున్నారు.
తమిళనాడు ప్రజలకు కూడా ఈ ‘కొత్త కాంబినేషన్’ తప్పు కాదనిపిస్తే, నచ్చితే… కొత్త జంటని ఆశీర్వదించి టివికే పార్టీని ఎన్నికలలో గెలిపించినా ఆశ్చర్యం లేదు.
Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs in the 52nd match of IPL 2026.…
Suriya’s long-delayed film Karuppu, directed by RJ Balaji, has finally locked its theatrical release date.…