విజయ్‌ సరైన నిర్ణయం తీసుకుంటే…

పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడు రాజకీయాలు, ఎన్నికల ఊసులు మనకెందుకులే అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో జరుగుతున్న భిన్నమైన రాజకీయాలు, ఎన్నికలు, పొత్తులు, కత్తులు, ఓటర్ల సరళి, ఫలితాలు ఓ రాజకీయ నమూనా లేదా కేస్ స్టడీగా అన్ని రాష్ట్రాలకు పనికివస్తాయి.

కనుక పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలు, పార్టీలు, ఎన్నికలు, పొత్తులు, కత్తుల గురించి నాలుగు ముక్కలు తెలుసుకుంటే నష్టం లేదు.

ADVERTISEMENT

తమిళనాడులో దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది. కానీ వాటి అధినేతలు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పలువురు ఆరాటపడ్డారు.

తాజాగా విజయ్‌ దళపతి టీవీకే పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పొత్తుకి బిజేపి చేయని ప్రయత్నం లేదు. కానీ ఒంటరిగా సాగాలనుకుంటున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్‌ 23న జరుగబోతున్నాయి.

ఈ నేపధ్యంలో ఓ తాజా సర్వేలో మళ్ళీ అధికార డీఎంకే ఎన్నికలలో 104 నుంచి 108 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 118 సీట్లు అవసరం.

విజయ్‌ పార్టీ భారీ మెజార్టీతో కాకపోయినా తొలిప్రయత్నంలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని ఆశపడుతోంది. కానీ దానికి కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది.

విజయ్‌ పార్టీ ప్రవేశించడంతో డీఎంకే, అన్నాడీఎంకేల ఓట్లు చీలిపోతాయని వేరే చెప్పక్కరలేదు. ఈ మూడు పార్టీలతో పాటు డీఎంకేతో కాంగ్రెస్‌, అన్నాడీఎంకేతో బిజేపి కూడా ఉన్నాయి. ఇవి కాక ‘నామ్‌ తమిళర్ కట్చి’ అనే మరో పార్టీ ఈసారి కనీసం 8 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది.

ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతునందునే విజయ్‌ వేరే పార్టీలతో పొత్తులకు అంగీకరించడం లేదు. అది ఆత్మవిశ్వాసమని అనుకున్నా అతివిశ్వాసమని తర్వాత నిరూపితమవుతుంది. కనుక ఇప్పుడు పొత్తులు నిరాకరిస్తున్న విజయ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీతో చేతులు కలపక తప్పదు. కలపకపోతే ఎమ్మెల్యే చేజారిపోతారు.

ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని విజయ్‌ అంచనా వేశారో లేదో తెలీదు. కానీ సర్వే ప్రకారమే ఫలితాలు వస్తాయని ఏ మాత్రం అనుమానమున్నా స్నేహ హస్తం అందిస్తున్న బిజేపితో ఇప్పుడే పొత్తు కుదుర్చుకుంటే భవిష్యత్‌కు భద్రత ఏర్పడుతుంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Peddi, Paradise, Bhogi: Mass Formula Tiring Out Audiences

“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…

27 minutes ago

Big Case Against EC Chief: What Is The SC Verdict?

Election commission chief Gyanesh Kumar had been facing a peculiar challenge as the people of…

56 minutes ago