Telugu

ప్రమాదాలలో విజయ్ పొలిటికల్ జర్నీ…

TVK పార్టీ అధినేత ఎన్నికల ర్యాలీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేసేందుకు గాను విజయ్ తన అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో విజయ్ కాన్వాయిని అభిమానులు చుట్టుముట్టారు.

దీనితో క్రౌడ్ మ్యానేజ్ మెంట్ విషయంలో మరోసారి గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంలో TVK పార్టీ నేత అర్జున్ కారు ఓ పోలీస్ అధికారిని ఢీ కొట్టింది. అయితే సదరు అధికారికి గాయం కాగా అక్కడే ఉన్న అంబులెన్స్ లో ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు.

ADVERTISEMENT

అయితే గతంలో కూడా కరూర్ వేదికగా విజయ్ TVK పార్టీ తరుపున ఏర్పాటు చేసిన ఒక రాజకీయ సభలో కూడా ఇదేమాదిరి క్రౌడ్ మ్యానేజ్ మెంట్ చేతకాక, అభిమానుల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగి సుమారు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఈ చేదు ఘటనకు గాను TVK పార్టీ అధినేతగా విజయ్ పై కేసు నమోదయ్యింది, అందుకుగాను విజయ్ సీబీఐ విచారణను సైతం ఎదుర్కుంటున్నారు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు తిరుచిరాపల్లి లో ఇలా ఓ పోలీస్ అధికారి గాయపడడం తో ప్రమాదాలలో విజయ్ పొలిటికల్ జర్నీ అంటూ ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

అయితే ఎన్నికల నామినేషన్ కే పరిస్థితి ఇలా ఉంటే ఇక నువ్వా నేనా అంటూ సాగే ఎన్నికల ప్రచార సభలకు విజయ్ TVK పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో.? ఇంకా రానున్న రోజులలో ఇలాంటి ప్రమాదాలు మరెన్ని వినాల్సి వస్తుందో అన్న చర్చ మొదలయ్యింది.

అయితే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది.? ఏ రాజకీయ పార్టీ నాయకులకు లేని ఈ రకమైన చిక్కులు ఒక్క విజయ్ కే ఎందుకు ఎదురవుతున్నట్టు.? ఇవి అనుకోని ప్రమాదాలేనా.? లేక TVK పార్టీ పై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమా.? ఇలా వరుస ఘటనలు జరుగుతూ ఉంటే విజయ్ సభలకు సామాన్య ప్రజలు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా.?

తమిళ ప్రజల క్షేమానికి తన పొలిటికల్ ఎంట్రీ అంటూ ప్రచారం చేసుకుంటున్న విజయ్ ముందుగా తన పార్టీ కార్యక్రమాలలో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించగలగాలి. లేదంటే ఆ ప్రమాదాల్ని కూడా ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రాలుగా మారుతాయి, అలాగే సామాన్య ప్రజానీకంలో అభద్రతా భావాన్ని సృష్టిస్తాయి.

ఏదిఏమైనా విజయ్ ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన సినీ అభిమానాన్ని రాజకీయ బలంగా మార్చుకోవాల్సిన ఇటువంటి కీలక సమయంలో ఇలాంటి వరుస సంఘటనలు రాజకీయంగా TVK పార్టీని బలిపీఠం ఎక్కిస్తాయి అన్న విషయం గుర్తించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీకి మళ్ళీ చేతి నిండా పని.. థాంక్యూ లోకేష్!

డీఎస్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్స్‌తో వైసీపీ చేతి నిండా పని కల్పించిన కూటమి ప్రభుత్వం, మరోసారి పని…

6 minutes ago

Allu Arjun Must Lock Sandeep Reddy Immediately?

Allu Arjun is one of the biggest stars in Indian cinema at this point in…

28 minutes ago