
ఎవ్వరు ఊహించని విధంగా తమిళ రాజకీయాలలో విజయ్ TVK సంచలనం సృష్టిస్తుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న DMK, అన్నా DMK లను సైతం వెనక్కి నెట్టి విజయ్ విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల ప్రకారం స్టాలిన్ DMK … 51, AIADMK 71, విజయ్ TVK 112 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెండు వ్యాఖ్యలు ట్రేండింగ్ లో కనిపిస్తున్నాయి. 112 సీట్లలో విజయ్ TVK ఆధిపత్యంలో ఉన్న సందర్భంగా విజయ్ ను ఉద్దేశించి ” విజయ్ అనే నేను” అంటూ విజయ్ ను తమినాడు కాబోయే సీఎం గా భావిస్తూ పోస్టులు పెడుతున్నారు విజయ్ అభిమానులు.
ఇక అలాగే తమిళనాడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అప్పటి సీఎం స్టాలిన్ ని ఉద్దేశించి విజయ్ ” స్టాలిన్ అంకుల్” అంటూ సీఎం స్టాలిన్ ని రోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ రెంటిని విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
నాడు విజయ్ స్టాలిన్ ని అంకుల్ అని పిలవడం పై DMK పార్టీ నేతలు, కార్యకర్తలు విజయ్ పై తీవ్ర విమర్శలు చేసారు. అలాగే ఎన్నికలలో విజయ్ TVK పార్టీ కి కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేరంటూ హేళన చేసారు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తానికి రివర్స్ అయ్యింది.
ఐదేళ్లు సీఎంగా బాధ్యతలు నెరవేర్చిన స్టాలిన్ ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా వెనుకంజలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టాలిన్ DMK కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి మూడోస్థానానికి పరిమితం కానుంది. ఇక విజయ్ TVK అధికార పీఠానికి ఒక్క అడుగు దూరంలో నిలుచుంది. రాజకీయాలలో ప్రజలు తలచుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం అనే చెప్పాలి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…