
టీవీకే అధినేత దళపతి విజయ్ ప్రభంజనం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను తట్టుకుని ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలలో టీవీకే అభ్యర్థులను విజయం వైపు నడిపించారు.
అలాగే విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలలోను భారీ విజయాన్ని అందుకున్నారు. పేరంబూరు లో సుమారు 50 వేలకు పైగా మెజారిటీ సాధించగా ఇక తిరుచ్చి ఈస్ట్ నుంచి 27 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. దీనితో ఈ రెండు స్థానాలలో ఎదో ఒక నియోజకవర్గాన్ని విజయ్ వదులుకోవాల్సి వస్తుంది.
అయితే తానూ వదులుకోవడానికి సిద్దమైన నియోజకవర్గం లో ఉపఎన్నికలు అనివార్యం కావునా ఆ స్థానంలో విజయ్ తన బదులు ఎవరిని పోటీలో ఉంచబోతున్నారు అనేది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది. తన తండ్రిని బరిలోకి దింపబోతున్నారు అంటూ కొన్ని రూమర్స్ బయటకు రావడం, లేదు లేదు సినీ నటి త్రిష పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అంటూ మరికొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
అయితే ఏదిఏమైనా విజయ్ పోటీ చేసిన ఈ రెండు స్థానాలలో ఒక నియోజకవర్గంలో ఉపఎన్నిక అనేది తప్పనిసరి. ఇదిలా ఉంటే కొళత్తూర్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ టీవీకే అభ్యర్థి V.S బాబు చేతిలో సుమారు 9 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో విజయ్ పోటీ చేసి వదులుకోబోతున్న స్థానం లో ఉపఎన్నికలు అనివార్యం కాబట్టి స్టాలిన్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవడానికి ఆ ఉపఎన్నికలను వాడుకుంటారా.? అన్న చర్చ మొదలయ్యింది. విజయ్, ఈ రకంగా స్టాలిన్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తారా.? స్టాలిన్ అందుకు సాహసిస్తారా.? అనేది ఇక్కడ అతి పెద్ద ప్రశ్నగా మారింది.
రాష్ట్రం మొత్తం విజయ్ వేవ్ నడుస్తున్న తరుణంలో ఉపఎన్నికలలో డీఎంకే స్టాలిన్ కు ప్రజలు మద్దతు పలికే అవకాశం ఉంటుందా.? ఒకవేళ ఆ ఉపఎన్నికలలో స్టాలిన్ సాహసించి పోటీకి సై అన్నా కూడా స్టాలిన్ గెలవలేకపోతే అది స్టాలిన్ రాజకీయ జీవితంలో మరోచెరపలేని చీకటి మచ్చగా మిగిలిపోవడం ఖాయం.
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…