
నిజమే వారసుడు మొత్తం కిచిడి మిక్స్ లా ఉంది. ఒక్కో సీన్ ఒక్కో బ్లాక్ బస్టర్ ని గుర్తు చేసింది. కొన్ని డిజాస్టర్ల రిఫరెన్సులు కూడా ఉన్నాయి లెండి. అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, మహర్షి లాంటి పెద్ద సినిమాలతో మొదలుపెట్టి అప్పుడెప్పుడో జనాలు పూర్తిగా మర్చిపోయిన కాలం నాటి నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సి దాకా చాలా పోలికలు కనిపించేశాయి. ఇంకేముంది యాంటీ ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లు వీడియోలు బయటికి తీసి మీమ్స్ కి పని చెప్పేశారు. ట్విట్టర్ లో అధిక శాతం దీని గురించిన చర్చే నడుస్తోంది.
ఇదంతా ఒక కోణం. మరోవైపు చూస్తే దిల్ రాజు ఇదేమి కొత్త కథ కాదని గుర్తించలేనంత అమాయకులు కాదు. తెలిసే తీశారు. మహేష్ బాబు, బన్నీ లాంటి స్టార్లు తెలుగులో చేయడానికి విముఖత చూపించడానికి కారణం అర్థమయ్యిందిగా. ఇదే స్టోరీ అయితే విజయ్ కు నచ్చింది. గత కొన్నేళ్లలో ఇలాంటిది తాను చేశానా లేదా అనేది చెక్ చేసుకున్నాడు తప్పించి మిగిలిన హీరోలు ఆల్రెడీ చేయడం గురించి పట్టించుకోలేదు. ఎక్కడో కనెక్ట్ అయిపోయాడు. ఆ మాటకొస్తే అదిరింది, విజిల్, మాస్టర్, పోలీసోడు స్ఫూర్తి పొందినవేగా.
దర్శకుడు వంశీ పైడిపల్లి దిల్ రాజు పొంగల్ సీజన్ ని నమ్ముకున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కంటెంట్ యావరేజ్ గా ఉన్నా విజయ్ సినిమాలకు ఈ పండగకు బ్రహ్మరథం పడతారు. తెలుగులో ఆడినా ఆడకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఒరిజినల్ వెర్షన్ గిట్టుబాటు కావడమే కీలకం. పైగా తునివు స్టైలిష్ యాక్షన్ మూవీ. ఫ్యామిలీ మాస్ కి ఫస్ట్ ఆప్షన్ వారసుడే అవుతుందనే ధైర్యం ఎస్విసి టీమ్ లో ఉంది. కలగూరగంపలా పాత హిట్లన్నీ మిక్సీ కొట్టి తీసిన సినిమాలు గతంలో ఆడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. మరి వారసుడు అదే కోవలో చేరుతుందో లేదో వేచి చూడాలి. తెలుగులో మాత్రం అద్భుతాలు చేయడం డౌటేనని నెటిజెన్ల ఓపెన్ కామెంట్.
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…
The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…