
తాజాగా విడుదలైన తమినాడు ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ, టీవీకే అధినేత విజయ్ తో జగన్ ను సరిపోల్చుతుంది. అయితే వీరిద్దరి మధ్య పోలిక అసలు ఎలా సరితూగుతుందో వైసీపీ వివరించగలదా.?
తండ్రి హఠాన్మరణం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా అవ్వడానికి పావులు కదిపిన వైఎస్ జగన్ ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని సినీ హీరో విజయ్ తో ఎలా సరిపోల్చుకుంటున్నారు.? దశాబ్దాల రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఎదిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సుపరిచితుడే.
కానీ విజయ్ కు అటువంటి రాజకీయ వారసత్వ బలం అంటూ ఏమి లేదు. కేవలం తన కష్టం మీద సినీ ఇండస్ట్రీలో సంపాదించుకున్న సినీ అభిమాన బలమే తన పొలిటికల్ ఎంట్రీ కి పెట్టుబడిగా పెట్టారు దళపతి విజయ్. ఇక జగన్ వైఎస్ మరణం తరువాత ఓదార్పు యాత్ర అంటూ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు.
అలాగే లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు భుజాన మోస్తూ, పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కొంటు 16 నెలలు జైలు జీవితం అనుభవించి గత దశాబ్దం గా బెయిలు మీద ఉంటూ రాజకీయం చేస్తున్నారు. అటువంటి జగన్ కు ఎటువంటి అవినీతి మరకలు లేని విజయ్ కి పోలిక హౌ.?
2011 లో వైసీపీ పార్టీని స్థాపించి తండ్రి మరణానికి ఓదార్పు అంటూ యాత్రలు మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాలకు శవ రాజకీయాలను పరిచయం చేసారు వైఎస్ జగన్. ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో పాడెక్కిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకును తనకు అనుకూలంగా మలచుకోవడంలో పూర్తిగా విజయం సాధించగలిగారు జగన్.
అలా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ను, తండ్రి రాజకీయ చరిష్మాను పెట్టుబడిగా పెట్టుకుని సీఎం కావాలని అనే లక్ష్యంతో 2011 లో మొదలుపెట్టిన వైసీపీ ప్రాయాణాన్ని 2019 లో పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్. అంటే పార్టీ పెట్టిన 8 సంవత్సరాల తరువాత జగన్ సీఎం గా ప్రజామోదం సంపాదించుకున్నారు.
కానీ విజయ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. 2024 లో విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించి తొలి ప్రయత్నంలోనే ఎవరి సాయం లేకుండా ఒంటరిగా పోటీ చేసి సీఎం పీఠాన్ని అందుకున్నారు.
ఇక జగన్ సీఎం కావడానికి ఆయనకు ‘సాక్షి ‘అనే సొంత మీడియా ఉంది, వార్తాపత్రిక ఉంది. ఇక తండ్రి వైఎస్ రాజకీయ చరిష్మా వైసీపీ కి గట్టి రాజకీయ పునాదిగా ఏర్పడింది. అలాగే తల్లి విజయలక్ష్మి ఒక్క ఛాన్స్ ప్రచారం, చెల్లి షర్మిల పాదయాత్ర ల ప్రభావం వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.
మరి విజయ్ కి తనకంటూ సొంత మీడియా లేదు, తన పార్టీ కార్యక్రమాలు ప్రజలలోకి బలంగా తీసుకెళ్లగలిగే సొంత వార్త పత్రిక లేదు. ఇక తల్లి తండ్రుల ప్రచారాలు, తోడబుట్టిన వాళ్ళ సాయాలు ఏమి కూడా విజయ్ తీసుకోలేదు. అలాగే వైసీపీ మాదిరి బీజేపీ తో విజయ్ తెరచాటు స్నేహాలు కొనసాగించలేదు.
పొరుగు రాష్ట్రాల సీఎం లతో లాలూచి రాజకీయాలు చేసుకుని తమ రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బ తీయలేదు. జగన్ ఒంటరి పోటీ వెనుక ఎన్నో కంటికి కనిపించని అదృశ్య శక్తులు తీవ్రంగా శ్రమించాయి. అలాగే విజయ్ టీవీకే జగన్ వైసీపీ మాదిరి సోషల్ మీడియాలో వికృత చేష్టలకు దిగజారలేదు.
వైసీపీ మాదిరి టీవీకే మహిళలను అగౌరవపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ విమర్శలు చేయలేదు. అలాగే ప్రత్యర్థి పార్టీల నేతల మీద వ్యక్తిగత దూషణలకు మొగ్గు చూపలేదు. అలాగే విజయ్ జగన్ మాదిరి ఆస్తుల కోసం సొంత తల్లిని కోర్టుకి ఈడ్చలేదు, సొంత చెల్లి పై వ్యక్తిగత దూషణలు చేయించలేదు.
ఇక చివరిగా విజయ్ కు జగన్ మాదిరి “కోడికత్తి సింపతిలు” లేవు, ఇక “గుండె పోటుగా” మార్చబడిన బాబాయ్ వివేకా “గొడ్డలి వేటు” కథలు తెలియవు, “గులకరాయి” దెబ్బలు కనిపించలేదు. అలాగే విజయ్ జగన్ మాదిరి ఎన్నికల ప్రచారంలో వందల కోట్ల ధనాన్ని వెచ్చించలేదు. ఇక విజయ్ ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను పక్క పార్టీల నుంచి దిగుమతి చేసుకోకుండా సామాన్యులకు పార్టీ టికెట్లు కట్టపెట్టారు.
వీటన్నిటిలో ఏ ఒక్కదానిలో కూడా జగన్ వైసీపీ కి – విజయ్ టీవీకే కి పోలికే లేదు. మరి జగన్ – విజయ్ ఇద్దరు ఒకటే ఎలా అవుతారు.? ఇద్దరి పొలిటికల్ జర్నీ ఒక్కటే ఎలా అవుతుంది.? దాన్ని వైసీపీ నుంచి సాక్షి వరకు ఎలా ప్రచారం చేయగలుగుతుంది.?
పైన ఉటంకించిన ఉదాహరణలన్నీ ఒక్కసారి వైసీపీ శ్రేణులు నిశితంగా గమనించగలిగితే, విజయ్ – జగన్ కు మధ్య YSR కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…