
Sai Reddy’s remarks draw attention
జగన్ టార్గెట్ గా, వైసీపీ ని ఇరుకున పెట్టెల సోషల్ మీడియాలో ఒక కథనం వెలువడినా ఉపేక్షించని వైసీపీ నేతలు వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి వైసీపీ టార్గెట్ గా, జగన్ కేంద్రంగా మతపరమైన ఆరోపణలు చేసినా వైసీపీ నుంచి కనీస స్పందన కూడా కరువయ్యింది.
వైసీపీ కి వ్యతిరేకంగా పెదవి విప్పినా, జగన్ టార్గెట్ గా గళం విప్పినా సొంత చెల్లి, తల్లిని కూడా క్షమించని వైసీపీ సాయిరెడ్డి పై మాత్రం వెనక్కి తగ్గుతుంది వై.? అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ శ్రేణులను సైతం ఆలోచింపచేస్తుంది. వైసీపీ గండి కోట రహస్యాలు, జగన్ కోటరీ లోగుట్టు మొత్తం సాయిరెడ్డి నిఘా నేత్రంతో ఉందనే వాస్తవమే వైసీపీ నోరు నొక్కుతుందా.?
రాష్ట్ర ముఖ్యమంత్రి ని సైతం కించపరుస్తూ విమర్శలు చేయగల వైసీపీ నేతలు స్వయంగా జగన్ మెప్పుకోసం, వైసీపీ లో పదవి కోసం నేతలు మతం మారాల్సిందే అంటూ సాయిరెడ్డి రెడ్డి చేసిన బలమైన ఆరోపణల పై మాత్రం పెదవి విప్పలేకపోతున్నారు.
తన వ్యాఖ్యలను కౌంటర్ ఇస్తూ తనను రెచ్చకొట్టాలని చూస్తే అది వైసీపీ రాజకీయ భవిష్యత్ కి అంత క్షేమం కాదు అంటూ గతంలో విజయసాయి చేసిన హెచ్చరికలే వైసీపీ నేతల నోటికి తాళం వేస్తున్నాయా.? వైసీపీ టార్గెట్ గా సాయిరెడ్డి చేసిన మతపరమైన ఆరోపణలకు వైసీపీ లో నెంబర్ 1 గా ఉన్న నేత సమాధానం చెప్పాలి అంటూ సాయి వైసీపీ అధినాయకత్వాన్ని సవాల్ చేస్తున్నా వైసీపీ మాత్రం సైలెంట్ అయిపొయింది.
వైసీపీ హిందూ వ్యతిరేకి అన్న భావన కలిగేలా సాయిరెడ్డి పదేపదే జగన్ కేంద్రంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు, అందుకు బలమైన ఆధారాలు ప్రజల ముందుంచుతున్నారు. అయినా కూడా వైసీపీ సాయిరెడ్డి తమ పార్టీ పై తమ అధినేత పై వేస్తున్న మత ముద్రలను తుడిచేందుకు సాహసించడం లేదు.
సాయిరెడ్డి కి వైసీపీ ఎదురెళ్ళినా, వైసీపీ కి సాయిరెడ్డి ఎదురొచ్చినా నష్టం మాత్రం వైసీపీ కే అన్న భావనలోకి వైసీపీ వచ్చిందా.? అందుకే వైసీపీ టార్గెట్ గా సాయిరెడ్డి ఎంతలా రెచ్చిపోతున్నా వైసీపీ నేతలు మాత్రం తమ కౌంటర్లతో సాయిరెడ్డి ని మరింత రెచ్చకొట్టే ప్రయత్నం చేయడం లేదా.?
గత ఐదేళ్లు తన అధికారంతో అటు పార్టీ నాయకులను, ఇటు ప్రతిపక్ష నేతలను, అధికారులను తన కన్నుసన్నలతో కంట్రోల్ చేసిన జగన్ ఇప్పుడు మాజీ నేత విషయంలో చెవులు మూసుకోవడం తప్ప మరేమి చెయ్యలేకున్నారా.?
The first event for the MS Subbulakshmi biopic was held in Chennai last night, and…
The YSR Congress ecosystem has the standard narrative when it comes to publicising that Chandrababu’s…