Telugu

ఒక్క అమ్మకి అబ్బకి పుట్టినవాడు ఎవడైనా చంద్రబాబులా మాట్లాడతాడా?

వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సభ్యసమాజం సిగ్గుపడే పదజాలంతో తీవ్రంగా దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు…’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేగాక టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని, రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారని, మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమ్మగారి మీద ఇటువంటి అనుచితవ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఇటీవలే నంధ్యాల ఉపఎన్నికలలో కూడా జగన్ చంద్రబాబు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో అక్కడి ఓటర్లు వైకాపాకు గట్టిగా బుద్ది చెప్పారు. అయినా వైకాపా వైఖరిలో మెరుపు వచ్చినట్టుగా కనిపించడంల్లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

1 hour ago

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

5 hours ago