
ఎండ దంచేస్తుండడంతో విజయకాంత్ తన తలపై ఎర్రని తువ్వాలను తలపాగాలా చుట్టుకున్నారు. అదే సమయంలో పొలం నుంచి వచ్చిన ఇంటి యజమాని వారిని చూసి అదిలించాడు. ఎవరు మీరు? ఇక్కడ భోజనం ఎందుకు చేస్తున్నారంటూ కసురుకున్నాడు. అయితే దగ్గరికొచ్చి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. వారు సాక్షాత్తు డీఎండీకే చీఫ్, నటుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత కావడంతో నోట మాట రాలేదు.
ఆ తర్వాత తేరుకుని ఇంట్లో నుంచి మరిన్ని వంటకాలు తెచ్చి వారికి వడ్డించాడు. రైతు అభిమానానికి ముగ్ధులైన వారు వాటిని కూడా ఆరగించారు. విషయం తెలిసిన స్థానికులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఇంటి యజమానికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…