
వారి బాధను చూసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్న చాలా సూటిగానే సమాధానం చెప్పారు. “వైసీపిలాంటి క్రిమినల్ పార్టీని ఎదుర్కోవాలంటే వేర్వేరుగా పోటీ చేస్తే ఎదుర్కోలేము. అందుకే టిడిపితో కలిసి పోటీ చేయబోతున్నాము. మేము మీలాగ జంతువులం కాము… మామూలు మనుషులం. కనుక కలిసే తిరుగుతాము.
అయినా మేము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో ఎవరికి దూరంగా ఉండాలో వైసీపి డిసైడ్ చేస్తుందా? మేమెప్పుడైనా జగన్ ఫలానా చోటి నుంచి పోటీ చేయాలని అడిగామా? మరి మా పొత్తుల ఊసు మీకెందుకు?” అంటూ సూటిగా, ఘాటుగా జవాబిచ్చారు. అయినా వైసీపి నేతలు తమ పాచిపాట మానుకోలేకపోతున్నారు.
ఇంతకాలం టిడిపి, జనసేనలు ఎక్కడి పొత్తులు పెట్టుకొంటాయో అని ఆందోళన చెందిన వైసీపి నేతలు ఇప్పుడు, టిడిపి ఇండియా కూటమికి దగ్గరవుతోందంటూ కొత్త ఏడుపు మొదలెట్టారు.
సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయిన వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే ప్రస్తావిస్తూ, “కేవలం ఇండియా కూటమి సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు. నారా లోకేష్ కు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇండియా కూటమిలో టిడిపి భాగస్వామి అని, టిడిపి,ఇండియా కూటమి విధానాలు ఒకటే అని ఇది నిరూపిస్తోంది. వీలైతే రెండూ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలనుకొంటున్నాయి. టిడిపి ఒంటరిగా పోటీ చేయలేదు,” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
టిడిపి ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదనే మాటను మరోవిదంగా టిడిపితో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ ఇతర పార్టీలు ముందుకు వస్తుంటాయని కూడా చెప్పుకోవచ్చు.
రాజకీయపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలు సాధించేందుకు కలుస్తుంటాయి. టిడిపి, జనసేనలు కూడా అదే చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది చాలా సహజం.
జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు కూడా ఒంటరిగా పోటీ చేయడం లేదు. అనేక పార్టీలతో కలిసి కూటములు ఏర్పాటుచేసుకొని పోటీ చేస్తున్నాయి. కానీ వాటిని జగన్, విజయసాయి, వైసీపి నేతలు ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ వారి ఏడుపు అంతా టిడిపి, జనసేనల గురించే.
ఇప్పుడు టిడిపి ఇండియా కూటమిలో చేరుతుందేమో అని మరో కొత్త ఏడుపు మొదలుపెట్టారు. ఏమి చేరకూడదా?దాని కోసం వైసీపి అనుమతి తీసుకోవాలా?
ఏపీలో వైసీపితో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీలు ముందుకు రావడం లేదు కనుకనే ఒంటరిగా పోటీ చేస్తోంది తప్ప సింహం అని కాదు. అయినా సింహంతో దోస్తీ చేస్తే ఏమవుతుందో తెలీదా?అందుకే ఎవరూ ముందుకు రావడం లేదు.
టిడిపి, జనసేనలకు సింహం అని చెప్పుకొనే జగన్ బటన్ నొక్కుడు సభలలో “ఒంటరిగా పోరాడుతున్నాను మీ ఈ బిడ్డను మీరే ఆదుకోవాలి” అంటూ ప్రాధేయపడుతుంటారు. సింహం ఎప్పుడూ సింహంలాగే ఉండాలి కానీ ఓసారి ఘర్జిస్తూ మరోసారి ‘మ్యావ్ మ్యావ్’ అంటే అందరూ నవ్వరా?
Tensions erupted in Punganur in Andhra Pradesh’s Annamayya district on the first day of local…
The TDP-led alliance has finalised its seat-sharing arrangement for the Andhra Pradesh Local Body Elections.…