Telugu

షర్మిల, కవిత, విజయసాయి.. మూడు పార్టీలకు డెడ్ ఎండ్?

విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) ప్రకటిస్తూ వైసీపీ, కూటమి ప్రభుత్వంపై చాలా విమర్శలే చేశారు. వీటిపై ఆ రెండు పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరం. బహుశః ఒకటి రెండు రోజుల్లో రెండు పార్టీలు దీటుగా స్పందించవచ్చు.

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడిన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ పెట్టుకొని తండ్రి కేసీఆర్‌తో సహా అందరినీ విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న కేటీఆర్‌, హరీష్‌ ఆమెకు మాటకు మాట జవాబులిస్తుంటే, తామే ఆమెకు రాజకీయంగా మరింత గుర్తింపు కలిగించినట్లవుతుందనే వారు ఆమెను అసలు పట్టించుకోవడం లేదు.

ADVERTISEMENT

వైసీపీలో అవమానాలు భరించలేక బయటకొచ్చి ‘పీఆర్పీ’ పెట్టుకున్న విజయసాయి రెడ్డి విషయంలో కూడా వైసీపీ ఇదేవిధంగా వ్యవహరించవచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కవితను, ఆమె పార్టీని పట్టించుకోవడం లేదు. అసలు ఆమె రాజకీయాలలో ఉన్నట్లు కూడా భావిస్తున్నట్లు లేదు. కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా విజయసాయి రెడ్డిని పట్టించుకోక పోవచ్చు.

కానీ చిరకాలం రాజకీయాలలో ఉన్న విజయసాయి రెడ్డికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగలననే నమ్మకం ఉండబట్టే పార్టీ పెట్టారు. కనుక ఆయన ఏపీ రాజకీయాల్లో తన ఉనికి చాటుకునేందుకు, ముందుగా వైసీపీ లేదా మరో పార్టీకి చెందిన సీనియర్ నేతలను పార్టీలోకి ఆకర్షించాల్సి ఉంటుంది. ఈరోజు పార్టీ ప్రకటన చేసినప్పుడే ‘వైసీపీ నేతలకు తమ పీఆర్పీ గేట్లు బార్లా తెరిచే ఉంచుతానని’ చెప్పారు కూడా.

బహుశః జగన్‌ తీరుతో ఇబ్బందిపడుతున్న వైసీపీ నేతలు వచ్చి చేరుతామని హామీ ఇచ్చి ఉండే ఉంటారు. ఒకవేళ వైసీపీ నేతల చేరికలు మొదలయితే, అప్పుడు వైసీపీ స్పందించవచ్చు. ఒకవేళ ఇవేమీ జరుగకపోతే పీఆర్పీ మనుగడ కష్టం. అప్పుడు విజయసాయి రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌ రహస్యాలు ఒకటొకటిగా బయటపెడుతూ తన ‘పీఆర్పీ రేటింగ్’ నిలకడగా ఉండేలా జాగ్రత్తపడే అవకాశం ఉంది.

కానీ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి చేతులెత్తేశారు. కనుక విజయసాయి రెడ్డి కూడా ఇలాగే చేసి చివరికి చేతులెత్తేసి వైసీపీలో విలీనం అయిపోతారా? లేక కల్వకుంట్ల కవితలా ఎన్నికల వరకు ఒంటరి పోరాటాలు చేస్తూ, అవమానాలు భరించానంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తారా? అనేది రాబోయే రోజుల్లో చూస్తాం.

కానీ కవిత, షర్మిల, విజయసాయిరెడ్డి ఇతర పార్టీల ముఖ్యనేతలను ఆకర్షించలేకపోతే వారి పార్టీలు ‘డెడ్ ఎండ్’ చేరుకున్నట్లే!

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ పార్టీ డెడ్ ఎండ్ చేరుకున్నట్లే. ఇక కవిత, విజయసాయిరెడ్డిల పరిస్థితి ఏమిటో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

US Wife Brutal Murder: Indian Man’s Shocking Conviction

A US jury has found Naresh Bhatt, a 39-year-old Nepalese American man of Indian origin,…

17 minutes ago

Dhanush-Sreeleela Disappoint Fans? OM Secret Revealed

Dhanush's anticipated film Om directed by Rajkumar Periyasamy, is gearing up for a worldwide theatrical…

28 minutes ago