Telugu

సాయిరెడ్డి ని వైసీపీ ప్రతికూల ఓటర్లు విశ్వసిస్తారా.?

వైసీపీ మాజీ ఎంపీ గా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ కోటరీ చేసిన అవమానాలకు గాను వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కొత్త రాజకీయ పార్టీతో వైసీపీ, టీడీపీ కి మూడో ప్రత్యామ్నాయంగా తానూ ఏపీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన విజయసాయి వైసీపీ ప్రతికూల ఓటర్ల మనసు గెలుచుకోగలరా.? గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ,

ADVERTISEMENT

వైసీపీ ఏర్పాటు నుంచి వైసీపీ ఘోర ఓటమి వరకు జగన్ ను సీఎం చేసేందుకు ఏపీ గల్లీల నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు రాజకీయాలు చేసిన విజయసాయి నేడు జగన్ కు వ్యతిరేకంగా, వైసీపీ కి ప్రత్యామ్నాయంగా ఉంటానంటే సామాన్య ప్రజానీకం సాయిరెడ్డి ప్రకటనలను విశ్వసించే అవకాశం ఉంటుందా.?

వైసీపీ తో కయ్యం అంటూ ఒకపక్క వైసీపీ మద్దతుదారులకు, ఆ పార్టీ సానుభూతి పరులకు, జగన్ సామాజికవర్గం వారికి ప్రత్యర్థిగా మారిన సాయిరెడ్డి ఇప్పుడు కూటమిని కాదని వైసీపీ ప్రతికూల ఓటర్లను తన వైపు ఆకర్షించుకోగలరా.? రెడ్లు, కమ్మ వారు తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి మరో సామాజికవర్గం వారు అర్హులు కారా.? అంటూ ప్రశ్నించిన సాయి నిన్న మొన్నటి వరకు అదే రెడ్డి సామాజికవర్గం కోసం సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధం చెయ్యలేదా.?

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనీసం మాటవరసకు కూడా మత మార్పిడల గురించి పెదవి విప్పని సాయిరెడ్డి నేడు రాష్ట్రంలో విస్తృతంగా మతమార్పిడులు జరిగుతున్నాయని, గత వైసీపీ పాలనలోను జరిగాయని గళం విప్పితే సాయిరెడ్డి ని విశ్వసించే అవకాశం ఉంటుందా.?

తిరుమల లడ్డు కేంద్రంగా వైసీపీ, టీడీపీ మధ్య సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే బాధితుడిగా మారిన నేపథ్యంలో నాడు స్పందించని సాయి నేడు వెంకన్న సాక్షిగా అంటూ ప్రమాణాలు చేస్తే ఫలితం ఉంటుందా.? నాడు జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి జై కొట్టి నేడు అమరావతి మద్దతు పలికితే ఏపీ ప్రజలు వైసీపీ, టీడీపీ కి ప్రత్యామ్నాయంగా సాయిరెడ్డి కొత్త పార్టీ వైపు ఆకర్షితులవుతారా.?

సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుతో ఎవరిని పొలిటికల్ గా టార్గెట్ చేయాలనుకుంటున్నారు.? ఏ సామాజివర్గం ఓట్లను చీల్చాలని భావిస్తున్నారు.? అసలు ఏపీలో మరోకొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు తగ్గ గ్యాప్ ఉందా.? తనకున్న సినీ ఛరిష్మా, వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్ ను పెట్టుబడిగా పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పటికి క్షేత్ర స్థాయిలో బలమైన రాజకీయ పునాది వెయ్యలేకపోయారు. అటువంటి తరుణంలో సాయిరెడ్డి కి సాధ్యమా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nandana Detained! YouTuber Lands in Big Trouble

Telugu YouTuber Rama Nandana, known online as Nandu’s World, was taken into custody by RGIA…

5 minutes ago

Toxic OTT: ZEE5 Offer Value Crashes by Shocking 80%?

Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…

5 minutes ago