
జీవిత చరిత్రలు వ్రాసుకునే ప్రముఖులు తమ గొప్పలు చెప్పుకోవడానికే ఇష్టపడతారు తప్ప చేసిన తప్పులు, అసమర్ధత గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ విజయసాయి రెడ్డి అటువంటివారు కారు.
తిరుపతి మీడియా సమావేశంలో చాలా నిసంకోచంగా తాను 2016 నుంచి 2018 వరకు ఎన్డీయే నుంచి టీడీపిని విడగొట్టడానికి అహర్నిశలు కృషి చేశానన్నారు. వాటిని విడగొట్టేందుకు తాను రకరకాల ప్రయోగాలు చేశానని, చివరికి తన ప్రయత్నాలు ఫలించి అవి విడిపోయయని ఇన్నేళ్ళ తర్వాత విజయసాయి రెడ్డి తన నోటితోనే స్వయంగా బయటపెట్టారు.
నాడు ఎన్డీయే నుంచి టీడీపి బయటకు వచ్చేసినప్పుడు అందరూ సిఎం చంద్రబాబు నాయుడినే నిందించారు. అయన పార్టీలో కొందరి చెప్పుడు మాటలు విని బిజేపితో బంధం తెంచుకున్నారని విమర్శలు వచ్చాయి. అయితే అందుకు నేను చేసిన కుట్రలే కారణమని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పుకోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
బిజేపి-టీడీపిలను విడదీస్తేనే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగలదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించి, విజయసాయి రెడ్డికి ఈ బాధ్యత అప్పగించినట్లు భావించవచ్చు.
నాడు ఆయన చేసిన ఈ కుట్రల పర్యవసానాలు వల్లనే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయని స్పష్టమవుతోంది.
నేడు విజయసాయి రెడ్డి వైసీపీలో లేకపోయి ఉండొచ్చు. కానీ ఆనాడే ఎన్డీయే నుంచి టీడీపిని విడదీసేందుకు ప్రయత్నించిన జగన్, మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారా?నేటికీ టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, బిజేపి-టీడీపి బంధం విడగొట్టేందుకు ప్రయత్నించకుండా ఉంటారా? అనే అనుమానం కలుగుతుంది.
మూడు పార్టీల బందం తెగ గొట్టేందుకు వైసీపీ ఎంత గట్టిగా ప్రయత్నిస్తుందో, కానీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమ బందం బలపరుచుకునేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.
నాడు కుట్రలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరించడానికి వస్తున్నారు. తనకీ ముఖ్యమంత్రి కుర్చీ ఇమ్మనమని ప్రజలను కోరబోతున్నారు. ఇద్దామా?
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…