Telugu

శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్.. ఈ ఉపశమనం అవసరమే!

రాజకీయాలు హుందాగా సాగుతున్నప్పుడే రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ వాతావరణం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం తగ్గిపోయింది. కనుక రాజకీయ వాతావరణం కూడా కలుషితమైంది.

ఇలాంటి రాజకీయాలతో వేసారి పోయున్న ఆంధ్రా ప్రజలకు నేటి నుంచి ప్రారంభమయిన శరన్నవరాత్రులు చాలా ఉపశమనం కలిగిస్తాయి.

ADVERTISEMENT

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.

దసరా పండుగ అంటే మొట్టమొదట చెప్పుకునేది విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దేవీ శరన్నవరాత్రుల గురించే. దేవీ శరన్నవరాత్రుల తొలిరోజున నేడు బెజవాడ కనకదుర్గమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేలాదిమంది భక్తులు తరలివచ్చినట్లే, ఈ శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

ఈరోజు (ఆదివారం) సాయంత్రం నుంచే విజయవాడ ఉత్సవ్ 2.0 కూడా ప్రారంభం కాబోతోంది. నగరంలో పున్నమి ఘాట్, సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల.. ఒకేసారి ఈ మూడు ప్రదేశాలలో అట్టహాసంగా ఈ వేడుకలు జరుగుతాయి.

రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, దేశం నలుమూలల నుంచి వివిధ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయి.

అలాగే నోరూరించే ఆంధ్రా పిండివంటలు, శాకాహార, మాంసాహార ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనుక నేటి నుంచి విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది.

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆలయం, భీమవరంలోని శ్రీ మవుళ్ళమ్మ అమ్మవారి ఆలయం, కాకినాడ జిల్లా కొవ్వూరులో శ్రీ వారాహి అమ్మవారి ఆలయం, అనకాపల్లిలో శ్రీ నూకాలమ్మ ఆలయం, విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి, విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కనుక ఇంతకాలం కూటమి ప్రభుత్వం-వైసీపీ రాజకీయాలతో అట్టుడికిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ఈ పర్వదినాలలో వెల్లివిరుస్తున్న ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా ఉపశమనం పొందుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

56 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

1 hour ago