
ఈరోజు తంగలాన్ సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్ చేసారు. చుసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ..ఈ సినిమాలో విక్రమ్ గాడిదలు కాసే కాపరి పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కె.జి.ఎఫ్ గనుల నేపథ్యంలో తీస్తున్నారు అని ముందుగానే దర్శకుడు పా.రంజిత్ ప్రకటించాడు. ఈ టైటిల్ టీజర్ లో బంగారు గనుల కోసం బ్రిటిష్ వాళ్ళు ప్లాన్లు వేస్తున్నట్లు.. వాళ్ళ గనుల తవ్వకాల్ని ఆపడానికి గాడిదకాపరులు ఎలాంటి పోరాటం చేశారు అన్నది చూపించారు.
‘తంగలాన్’ అంటే హీరో పేరు. అందుకే అదే పేరుని అన్ని భాషల్లో టైటిల్ గా పెట్టారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా లో విక్రమ్ గెటప్ చూస్తే కమల్ హాసన్ మరుదనాయగం గెటప్ గుర్తొస్తుంది. జి.వి.ప్రకాష్ సంగీతం టీజర్ లో చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు.
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న…
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…