Telugu

విమలారెడ్డి చెప్పింది కాస్త వినండర్రా!

సికింద్రాబాద్‌లో తిరుమలగిరి చర్చిలో పాస్టర్‌గా చేస్తున్న ప్రవీణ్ పగడాల రాజమండ్రి సమీపంలో చనిపోవడంపై కేఏ పాల్, కొందరు వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి, రాజకీయాలు అందరూ చూస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఈ ఘటనపై వైఎస్ జగన్ మేనత్త విమలా రెడ్డి చాలా విచాక్షణతో మాట్లాడిన మాటలు కేఏ పాల్, వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా తప్పకుండా వినాలి. ఆమె ఏమన్నారంటే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు కనుక మద్యలో దూరిపోయి ఏదేదో మాట్లాడటం సరికాదు.

క్రైస్తవుల జీవితాలలో ఏమి జరిగినప్పటికీ అది ఆ భగవంతుడి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప వేరేగా జరుగదని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక ఈ ఘటనపై మాట్లాడటం అంటే ఆయన నిర్ణయాన్ని మనం ప్రశ్నిస్తున్నట్లే అవుతుంది. కనుక నో కామెంట్స్!

క్రీస్టియన్లలో భిన్న శాఖల మద్య ఐఖ్యత లేనిమాట వాస్తవమే. ఈ విశాల ప్రపంచంలో అందరూ ఐక్యంగా ఉండటం సాధ్యం కాదు. కుటుంబాలలోనే ఐక్యత లేనప్పుడు సమాజంలో ఐక్యత సాధ్యమా? కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అందరూ ఐక్యత చూపారు. అందుకు సంతోషించాల్సిందే. ఈ ఘటనపై మా మతంలో ఇతర శాఖలకు చెందిన పాస్టర్స్ స్పందించకపోవడాన్ని తప్పుగా అనుకోరాదు.

అందరూ స్పందించడం మొదలుపెడితే ఇదో పెద్ద రాజకీయ సమస్యగా మారిపోతుంది. కనుకనే అందరూ సంయమనం పాటిస్తున్నారు. ఈ కేసులో హడావుడి చేస్తున్నవారు కూడా సంయమనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కనుక వారిని వారి పని చేసుకోనీయాలి,” అని విమలా రెడ్డి అన్నారు. కేఏ పాల్ గారు వింటున్నారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

By Poll Result: Did Vijay Survive First Exam?

Tamil Nadu has found a new chief minister in the form of Vijay, who was…

20 minutes ago

నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే…

30 minutes ago