
[m9ad]
యూ ట్యూబ్ లో 5.2 మిలియన్స్ కు పైగా సొంతం చేసుకున్న ఈ టీజర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ తదితర మాధ్యమాలలో కలిపి మొత్తంగా మొదటి 13 గంటలకు 10 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో వస్తాయని బహుశా చిత్ర యూనిట్ అంచనా వేసిందో లేదో గానీ, ఈ స్పందనకు డివివి దానయ్య ఫిదా అయ్యుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఒరవడి అంతకంతకూ దూసుకుపోతుండడం విశేషం.
మెగా అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసేలా ‘రామ్…. రామ్ కొ.ణి.ద.ల.’ అంటూ డైలాగ్ వేసిన చెర్రీని చూసి ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజులు రికార్డులు బద్దలయ్యే సూచనలను ఈ టీజర్ కలిగించింది. రాబోయే కాలంలో ప్రమోషన్ ఇదే రేంజ్ లో ఉండి, ధియేటిరికల్ ట్రైలర్ కూడా అదరగోడితే, ‘రంగస్థలం’ రికార్డులను చెర్రీ సొంతం చేసుకోవడం కష్టసాధ్యమేమీ కాకపోవచ్చు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…