
భారత వన్-డే మరియు టెస్ట్ సారధి రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్ కు స్వస్తి పలికి ఇంకా ఒక వారం రోజులు కూడా అవ్వలేదు. ఇంతలోనే మరొక సంచలన న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లుకొడుతుంది. కోహ్లీ తాను రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు బీసీసీఐ కు చెప్పగా, బోర్డు అందుకు బదులుగా కోహ్లీ ని మరొకసారి ఆలోచించమని కోరినట్లు సమాచారం.
అధికారికంగా ఎటువంటి ప్రకటన లేని పక్షాన ఇదంతా ఊహాజనితమైన వార్తలే అంటున్నారు కొందరు ఫాన్స్. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక ఎక్స్ వేదికగా, చాలమంది నెటిజెన్లు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ రీచ్ ను క్యాష్ చేసుకుందామని ఆశ తోనే ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ను కొందరు వైరల్ చేసినట్లు కొన్ని రిపోర్ట్స్ లో వెలువడింది.
అయితే, ఎంత కాదనుకున్నా, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే సమయం మరెంతో దూరంలో లేదు అనే విషయం ఊహించిందే, అయినప్పటికీ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక, జట్టు సారధి బాధ్యతలను ఒక యువకుడిపై పెట్టె ఆలోచనలో ఉంది బోర్డు. ఆ లిస్ట్ లో గిల్ మరియు పంత్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిద్దరిలో కెప్టెన్సీ ఎవరికి అందించినా, జట్టులో ఒక సీనియర్ ఆటగాడు వారికి అండగా ఉండటం ఖచ్చితంగా జట్టు కు అవసరం, అది వారికీ ఆటలో ఒకరకమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇదే ఇక్కడా జరిగితే బావుంటుందని అంటున్నారు ఫాన్స్.
గత సంవత్సర కాలంగా టెస్ట్ జట్టులో పుజారా, రహానే వంటి సీనియర్ల లోటు స్పష్టంగా తెలిసిన వేళ, వారిద్దరితో పాటు ఇప్పుడు జట్టు కు రోహిత్ కూడా దూరమయ్యాడు. ఇదే ఉద్దేశమై బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ ను తన నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించుకోమని అడిగినట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ ఇంకా తన నిరయాన్ని చెప్పాల్సి ఉంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జూన్ చివరిలో మొదలయ్యే ఇంగ్లాండ్ సిరీస్ కు బీసీసీఐ మే 23 న జట్టు ను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అంతలోపు ఈ ఊహాగానాలే నిజమైతే విరాట్ తన నిర్ణయాన్ని తెలిపితే జట్టు తో పాటు ఇంగ్లాండ్ పయనమవుతాడు కోహ్లీ. జట్టు కు కోహ్లీ అవసరం ఉన్న వేళ, కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని ఆశిద్దాం..!
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…