
స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాపీని చూపిస్తూ… 1990-91 నుండి స్టీల్ ప్లాంట్ కు నష్టాలు ప్రారంభం అయ్యాయని, మొదటగా 480 కోట్ల నష్టంతో ప్రారంభమై 1995-96లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 202 కోట్లు నష్టాలలో స్టీల్ ప్లాంట్ ఉందని తెలిపారు. 2003-04లో చంద్రబాబు దిగిపోయే టైంకు 1546 కోట్ల లాభాల్లో స్టీల్ ప్లాంట్ ఉందని అన్నారు.
ఇది తన సొంత లెక్కలు కాదని, గూగుల్ లో కూడా ఉంటుందని, కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్న జివి రెడ్డి, మరి ఈ కాలాన్ని గోల్డెన్ లెగ్ అనాలా? ఐరన్ లెగ్ అనాలా? అంటూ ప్రశ్నించారు. మళ్ళీ 2018-19లో చంద్రబాబు దిగిపోయే సమయానికి 97 కోట్లు లాభాల్లో ఉందని, అంతకుముందు ఉన్న నష్టాలు కూడా భర్తీ అయ్యాయని అన్నారు.
ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరానికి గానూ 3319 కోట్లు నష్టాలను చవిచూస్తే, ఎవరి పాదం ఐరన్ లెగ్ అని, జగన్ మోహన్ రెడ్డి గారిదా? లేక చంద్రబాబు గారిదా? అంటూ డిబేట్ లో తన భావాలను పంచుకున్నారు. వైసీపీ వారికి ఏమైనా డౌట్ వస్తే గూగుల్ లో ఈ కాపీ ఉంటుందని, 2020-21 లెక్కలు ఇంకా తేలలేదని, ఈ ఏడాదిలో ఎంత నష్టం వస్తుందో చూడాలన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారని, అప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, ఇంకా అందులో అడ్డుకోవడం ఏముందని ప్రశ్నించిన జివి రెడ్డి, ఒకవేళ వాళ్ళు చెప్పిందే వాస్తవం అయితే సొంత పార్టీ కాంగ్రెస్ తోనే వైఎస్సార్ కొట్లాడి అడ్డుకుంటే, మీరు ఇపుడు బీజేపీతో ఎందుకు ఫైట్ చేయడం లేదని నిలదీశారు.
వైఎస్సార్ హయాంలో ఉన్న నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడినట్టే, నేడు వైసీపీ కూడా బీజేపీతో పోరాడి సాధించుకోవాలి కదా! దీనికి వైసీపీ వాళ్ళ దగ్గర జవాబు ఉండదు, నోరు తెరిస్తే అబద్ధాలు, చేతకాని మాటలు, చేతకాని యవ్వారాలు, యు టర్న్ లు అంటూ వైసీపీ నేతల తీరును ఎండకట్టారు జివి రెడ్డి. ఈ వివరణతో కూడిన వీడియో అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…