ఇదేంటి?మనది ఫ్లోటింగ్ కదా… గ్లాస్ బ్రిడ్జ్ అంటున్నారు?

అందమైన అమ్మాయిని సింగారించుకుంటే మరింత అందంగా కనబడినట్లే ఏపీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖపట్నంని నాడు సిఎం చంద్రబాబు నాయుడు చాలా సింగారించారు.

వాటిలో ఆర్‌కే బీడ్ రోడ్ సుందరీకరణ, సముద్రం తీరం వెంబడి అనేక అందమైన పార్కుల నిర్మాణం, రోడ్డుకి ఇవతలవైపు మహనీయుల విగ్రహాలు, సముద్రం ఒడ్డునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, ఫైటర్ జెట్ మ్యూజియం, కైలాసగిరి, రోప్ వే, తెన్నేటి పార్కు… ఇలా ఒకటా రెండా అనేక పర్యాటక ఆకర్షణలు జోడించారు. ఇంకా జోడిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఇటీవలే ఆర్‌కే బీడ్ నుంచి తోట్లకొండ వరకు సముద్ర తీరం పక్కనే సాగే రోడ్డు మార్గంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. తాజాగా కైలాసగిరి కొండపై గ్లాస్ బ్రిడ్జ్ నిర్మింపజేశారు. త్వరలోనే ఇది పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

సుమారు రూ. 10 కోట్లు వ్యయంతో దీనిని నిర్మించారు. కొండ అంచు నుంచి 55 మీటర్లు పొడవుతో గాల్లో వ్రేలాడుతున్నట్లు ఈ బ్రిడ్జి నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే దీని ఫ్లోరింగ్ పూర్తిగా అద్దాలతో నిర్మించారు. కనుక ఈ అద్దాల వంతెనపై నిలబడి చూస్తే కాళ్ళ క్రింద కొండ దానిపై చెట్లు, ఇంకా దిగువన రోడ్డు, వాహనాలు, ఇంకా దిగువన సముద్రం, చుట్టూ అందమైన విశాఖ నగరం కనిపిస్తాయి.

ఇటువంటి గ్లాస్ బ్రిడ్జిలు చైనా వంటి దేశాలలో కనిపిస్తాయి. తొలిసారిగా మన విశాఖ నగరంలో దీనిని చూడవచ్చు. ఆ ఎత్తులో చాలా బలమైన ఈదురుగాలులు వీస్తుంటాయి. ఇక తుఫానులు వస్తే సరేసరి! కనుక తీవ్రమైన తుఫానులు, పెను గాలులను కూడా తట్టుకొని నిలబడేలా దీనిని ధృడంగా నిర్మించారు.

దీనిపై ఒకేసారి వందమంది నిలబడి ప్రకృతి అందాలు వీక్షించవచ్చు కానీ ముందస్తు జాగ్రత్త చర్యగా 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

దీని నిర్మాణానికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. విశాఖ వచ్చే పర్యాటకులు తప్పకుండా రోప్ వే ద్వారా కైలాసగిరి కొండపైకి చేరుకొని, అక్కడ కొండపై తిరిగే మినీ ట్రైన్, కొత్తగా నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి తప్పక ప్రయత్నించాల్సిందే!

కొసమెరుపు: ఈ గ్లాస్ బ్రిడ్జిని తానే నిర్మింపజేశానని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేసుకున్నారు. కానీ అయన వేసింది ఫ్లోటింగ్ బ్రిడ్జి కదా?అది రెండో రోజే సముద్రంలో కొట్టుకుపోయిందిగా? పొరపాటున అదనుకొని ఇది పెట్టారేమో?

ఓసారి గూగుల్లో ‘వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్’ అని కొడితే సముద్రంలో కొట్టుకుపోయిన ఆ బ్రిడ్జి మళ్ళీ కనపడుతుంది… దాంతో పాటే అది ఎలా కొట్టుకుపోయిందో వీడియోలు, అనేక స్టోరీలు కూడా కనిపిస్తాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Global Attention To Cockroaches: Real Or Paid?

The cockroach janta party movement has reached a significant position in the social ladder as…

23 minutes ago

Pics: Srushti Makes Green Glam Look Extra Spicy

Srushti Bannatti is bringing a punchy pop of lime green to the fashion frame, and…

43 minutes ago