
అరకులో దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు, రాజమండ్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు తదితరులు, అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సభలు నిర్వహించబోతున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుతినేస్తున్నారు. కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి, గ్రనైట్ అన్నీ దోచేసుకొంటూ, రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇవి సరిపోన్నట్లు ప్రతీ పనిలో కమీషన్లు దండుకొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు దొంగల చేతికి తాళం అప్పగించడంతో వారు దోచుకొంటున్నారు. ఆ దొంగతనాలను ఏవిదంగా ఓ పద్దతిప్రకారం చేయాలో జగన్ ప్రభుత్వం ఓ సిస్టమ్ తయారుచేసి పకడ్బందీగా అమలుచేస్తోంది. ప్రజాధనాన్ని, రాష్ట్ర సహజ వనరులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని దోచేసుకొంటోంది.
మోడీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే, ఇక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని, ప్రజలను కూడా దోచేసుకొంటోంది. ఈ వైసీపీ దోపిడీని బిజెపి మాత్రమే అడ్డుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని ప్రజలకు తెలియజేయడం కోసమే మంగళవారం రాష్ట్రంలో మూడు చోట్ల ఒకేసారి మా నాయకులు సభలు నిర్వహించబోతున్నారు,” అని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఇంత అవినీతికి పాల్పడుతోందని ఏపీ బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలకు చెప్పేబదులు, కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చర్యలు తీసుకొనేలా చేయవచ్చు కదా? కానీ ఢిల్లీ పెద్దలు, ఏపీ బిజెపి నేతలు కేవలం ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రాలో పరిస్థితుల గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి నేతలు కూడా చెప్పినా ఇంకా బిజెపి ఈవిదంగా వ్యవహరిస్తూ ఏపీలో ఏం సాధిద్దామని ఆశిస్తోందో?
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…
Yami Gautam’s Nayyi Navelli is finally out now in theatres. Horror comedy films are working…