
విశ్వక్ సేన్, నవీన్ చంద్ర, కృతి శెట్టి ప్రధాన తారాగణంగా ఎంపికయ్యారు. సుకుమార్ మాజీ సహచరులలో ఒకరు ఈ చిత్రానికి దర్శకుడిగా అరంగేట్రం చెయ్యబోతున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది మరియు సమ్మర్ 2021 లో విడుదల అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
పొరపాటున తన నంబర్‌ను డయల్ చేసిన ఒక ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడే యువతి కథ కప్పేలా. అతన్ని కలవడానికి ఆమె ఒక నగరాన్ని సందర్శించినప్పుడు, ఒక అపరిచితుడు ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు… ఆ తరువాత ఆమె జీవితంలో ఊహించని విషయాలు జరుగుతాయి. తెలుగులో నవీన్ చంద్ర ఆటో డ్రైవర్‌గా నటించాడు.
కప్పేలాలో అన్నా బెన్ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు దానికి కృతి శెట్టిని తీసుకున్నారు. ఈమె వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఆ సినిమా విడుదలకు ముందు పలు సినిమాలు ఆమె సైన్ చెయ్యడం విశేషం. ఈ సినిమా ఆమెకు చాలా కీలకం అవుతుంది.
నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య వేడెక్కిన వాతావరణం ఇప్పుడు కాస్త చల్లబడిందా…
Recently, the trailer for Nayanthara's upcoming film Mookuthi Amman 2: Mahasakthi directed by Sundar C,…