
Telangana Congress BRS Political Tensions
నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య వేడెక్కిన వాతావరణం ఇప్పుడు కాస్త చల్లబడిందా అన్నట్టుగా పరిస్థితులలో మార్పు కనిపిస్తుంది.
కల్వకుంట్ల భూఆస్తుల చిట్టా పొద్దుతో మొదలైన వీరి యుద్ధం కేటీఆర్ హోటల్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ కల్వకుంట్ల ఆస్తులు గురించి కాంగ్రెస్ నేతలు ప్రచారాలు మొదలుపెడితే అక్కడ రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలతో బిఆర్ఎస్ ఆరోపణలు షురూ చేసింది.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ పై విచారణ అంటూ రేవంత్ ముందుకెళితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటూ బిఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అంటూ బిఆర్ఎస్ మీడియా ముందుకొస్తే కేసీఆర్ ఎన్నికల అఫడవిట్ ను ఆధారంగా పెట్టుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా తో ఎటాక్ కి దిగింది.
ఒక ఛానెల్ లో ప్రసారమైన ప్రముఖ టీవీ షో ఆధారంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ నేతలను రోస్ట్ చేసిన విధానం, అందుకు బిఆర్ఎస్ నుంచి వచ్చిన రియాక్షన్ ఇవన్నీ కూడా రెండు పార్టీల మధ్య రాజకీయ వాతావరణాన్ని ఎలినో ఎండల మాదిరి హీటెక్కించాయి.
ఆ ఉధృతమైన వాతావరణం ఇరు పార్టీల శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటుగా తెలంగాణ ప్రజలను సైతం అయోమయంలోకి నెట్టింది. ఇటువంటి తీవ్రమైన వేడి వాతావరణం నుంచి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాస్త చల్లబడినట్టు కనిపిస్తున్నాయి.
దీనితో కాంగ్రెస్ – బిఆర్ఎస్ రాజకీయంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయా అన్నట్టుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. వేసవి తరువాత వాతావరణాన్ని చల్లబరిచేందుకు వచ్చే నైరుతి రుతుపవనాల మాదిరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ప్రస్తుతానికి ఈ ఇరు పార్టీల నేతలు, సోషల్ మీడియా సైనికులు కాస్త చల్లబడ్డారు. అయితే ఈ పార్టీల మధ్య ఏర్పడిన నైరుతి పవనాలు ఎపుడైన ఆవిరైపోవచ్చు. తిరిగి వేసవి ఎండలు తరహా వేడితో తెలంగాణ రాజకీయం వేడెక్కవచ్చు. ప్రస్తుతానికి చల్లబడిన రాజకీయ వాతావరణంతో ఇరు పార్టీల శ్రేణులు కాస్త ఉపశమనం పొంది తిరిగి వేసవి తాపానికి సిద్ధం కావల్సిందే…!
Recently, the trailer for Nayanthara's upcoming film Mookuthi Amman 2: Mahasakthi directed by Sundar C,…
Ram Charan-Sukumar’s RC17 was expected to begin with a pooja ceremony during Dasara. However, the…