
2025 సంక్రాంతి రిలీజ్ కు 2024 సంక్రాంతి కే కర్చీఫ్ వేసుకున్నారు “విశ్వంభర” చిత్ర యూనిట్. ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ కు అయిన థియేటర్ల రచ్చ వచ్చే ఏడాదికి ఉండకుడనే ఉద్దేశం తోనే ముందుగానే డేట్ ను లాక్ చేసుకున్నారు చిరు టీం.
ఇదలా ఉండగా, మరోపక్క నందమూరి నట సింహం బాలకృష్ణ సైతం తన సినిమాను సంక్రాంతి విడుదలకు ఖరారు చేసుకున్నారు. 2023 లో సంక్రాంతికి ఈ మెగా- నందమూరి సినిమాల సందడి జరగగా, ఆ ఏడు వెండి తెర మీదకు వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు తేల్చుకున్నాయి.
అయితే, శంకర్-చరణ్ ల “గేమ్ ఛేంజర్” డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ రిలీజ్ కు ముహూర్తం అంటూ నిర్మాత ‘దిల్ రాజు’ ఇప్పటికే అనేక ప్రెస్ మీట్ లలో వెల్లడించ్చినప్పటికీ రామ్ చరణ్ సినిమా ఈ క్రిస్మస్ కు వచ్చే అవకాశం రోజురోజుకి సన్నగిలుతుంది. దీనితో సంక్రాతి సెలవులను టార్గెట్ గా గేమ్ స్టార్ట్ చెయ్యాలని శంకర్ భావిస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.
దీనితో సంక్రాంతికి రానున్న మెగా స్టార్ విశ్వంభర విడుదల తేదీ మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఆఖరి దశ కు చేరుకున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న తేదీకే సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి విశ్వంభర టీం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
ఈ సమయంలో కొడుకు రామ్ చరణ్ కోసం తండ్రి చిరు వెనక్కి తగ్గుతాడా.? తగ్గిస్తాడా.? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ చిరు స్థానాన్ని భర్తీ చేసేందుకు చరణ్ వస్తుండడంతో మెగా ఫాన్స్ కొంత వరకు ఈ సంక్రాంతి పండుగున తమ అభిమాన నటుడి సినిమాను చూసే అవకాశం అయితే దక్కుతుంది.
మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ తరువాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ-150, వాల్తేర్ వీరయ్య, వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసాయి. మరి మొన్నటిదాకా జనవరి 10 న రిలీజ్ అంటూ విశ్వంభర యూనిట్ వెల్లడించగా, తాజాగా ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అనే ప్రశ్నకు-పోస్ట్-ప్రొడక్షన్, వీ.ఎఫ్.ఎక్స్ పనులు, గ్రాఫిక్స్ వంటి రంగాలలో ఆలస్యం అయ్యేలా ఉందంటూ తప్పుకుంటున్నారా..తప్పిస్తున్నారా..? అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.
For years, celebrity gossip, awkward questions and headline-making confessions came with a familiar backdrop: Karan…
October 23 will bring more than just Prabhas' birthday celebrations. The makers of Fauzi are…