
వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ పులివెందుల నాయకుడు వైస్ వివేకా హత్య జరిగి దాదాపు ఆరేళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికి ఆ కేసు తాలూకా అసలు వాస్తవాలు బయటకు రావడం లేదు. ఇలా అనేకన్నా వాస్తవాలను బయటకు తేవడంలో వ్యవస్థలు, ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనొచ్చు.
వివేకా గుండె పోటు నుంచి, గొడ్డలి వేటు వరకు నీలి మీడియాలో జరిగిన అసత్య ప్రచారాలు, అవినాష్ నిర్దోషి నుంచి చంద్రబాబు దోషి అనే సాక్షి పుకార్లు, బాధితులనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు..ఇలా వివేకా హత్య కేసులో వైసీపీ ఆడుతున్న జగన్నాటకాలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి.
వివేకా దారుణ హత్య ఏపీలో విచ్చలవిడిగా హత్య రాజకీయాలకు తెరలేపింది. గత ఐదేళ్లు దోషులను పెట్టుకోలేని నేరం మీదంటూ టీడీపీ, వైసీపీ మీద, మీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య జరిగింది, ఆ దోషం మీదే అంటూ వైసీపీ, టీడీపీ మీద ఆరోపణలు చేసుకుంటుంటున్నాయే తప్పా ఆ కేసులో అసలైన నిందితులను గుర్తించలేకపోతున్నాయి. చివరికి ఆ కేసులో ఉన్న ముఖ్య సాక్ష్యులు కూడా ఒక్కొక్కరుగా వివేకా చెంతకు చేరుతున్నారు.
అయితే అవి సహజ మరణాలా.? లేకపోతే ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న హత్యలా.? అనేది తేలాల్సి ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటే “వివేకా హత్య కేసు కూడా పరిటాల కథ” మాదిరే ముగుస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 2005 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ముఖ్య నేత పరిటాల రవి దారుణ హత్య జరిగింది.
2005 జనవరి 24 న ఆయన పార్టీ ఆఫీస్ లోనే ఆయన పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్చి చంపారు. అయితే ఈ కేసులో ప్రధమ ముద్దాయి నేనే అంటూ మీడియా ముందుకొచ్చిన మొద్దు శీను మా బావ కళ్ళలో ఆనందం చూడడానికే ఈ దారుణానికి ఒడిగట్టాను అంటూ బహిరంగంగా ప్రకటనలు చేసారు. అయితే ఆ నాటి ప్రభుత్వం ఈ కేసు పై ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి గుర్తుగా ఆ కేసు తాలూకా సాక్ష్యులందరు ఒక్కొక్కరుగా మృత్యు వాత పట్టారు.
పరిటాలను చంపింది నేను అంటూ మీడియాలో ప్రత్యక్షమైన మొద్దు శీను కూడా పరిటాల చనిపోయిన మూడేళ్లకే 2008 నవంబర్ 9 న తోటి నేరస్తుడి చేతిలో జైల్లో హత్య చేయబడ్డాడు. ఇలా వైస్సార్ ప్రభుత్వం లో జరిగిన పరిటాల హత్య అదే ప్రభుత్వ హయాంలో సాక్ష్యులు లేక నీరుగారిపోయింది. అయితే నాడు సీఎం గా ఉన్న వైస్సార్ ఆ ఘటనలను సమర్ధించుకుంటూ బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయలేదు.
ఇప్పుడు కూడా అదే మాదిరి వివేకా హత్య కేసుకి సంబంధించి ఆ కేసులో ముఖ్య సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అయితే నేడు కూడా వైస్సార్ వారసత్వంగా ఉద్భవించిన వైసీపీ ఈ సంఘటనలను కూడా తమకు అనుకూలంగా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుంది. వివేకా హత్య జరిగింది టీడీపీ హయాంలోనే, వేవిక కేసులోని సాక్ష్యులు మరణం చెందింది బాబు ప్రభుత్వంలోనే అంటూ పాత రాగానికి కొత్త రంగులేసి ప్రచారం చేస్తుంది.
అయితే నాడు వైస్సార్ హయాంలో పరిటాల హతయ్ జరిగిన నేపథ్యంలో ఆ నేరం సీఎం వైస్ రాజశేఖర్ రెడ్డి ది అవుతుంది, లేక ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యులందరు అనుమానాస్పద స్థితిలో మరణించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదా.? క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ రెండు కేసులలోను ఒకే రకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Koratala Siva is known for building films around powerful characters, strong conflicts and social themes.…
Haiwaan is finally releasing in theatres on September 11, 2026. Marking the return of Priyadarshan…