
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికి 8 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే జరిగిన ఈ దుర్ఘటనకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం వరకు అందరు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ భరోసా అందించారు.
ఇందుకు గాను కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి మొదలుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపముఖ్యమంత్రి పవన్, ఐటీ మంత్రి లోకేష్, హోమ్ మంత్రి అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరకు అందరు విశాఖ చేరుకున్నారు.
అలాగే ఎవరి కి తగ్గ ఆర్థిక సాయం వారు ప్రకటించి బాధిత కుటుంబాలకు భరోసా అందించారు. అలాగే జరిగిన ఘటన పై విచారణకు ఆదేశించారు. ఆర్ఐఎన్ఎల్ బాధిత కుటుంబాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ .25 లక్షల రూపాయల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని, మరణించిన వ్యక్తి రిటైర్మెంట్ వయసు వరకు వారి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ కోటర్స్ లో ఉండే అవకాశం ఇస్తామని, వారి పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలను అందిస్తామని ప్రకటించింది.
ఇక ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన చికిత్స సదుపాయాలను అందించడంతో పాటుగా అదనంగా రూ . 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఘటన పై తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాద సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇక మంత్రి నారా లోకేష్ సైతం చెక్కులిచ్చి చేతులు దులుపుకుంటానికి రాలేదని, రాజకీయాలు చేయడానికి కాదు ప్రభుత్వ సాయం చేయడానికి వచ్చామంటూ బాధితులకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి పవన్ ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1.72 కోట్లు కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఇక సదరు కుటుంబంలో నుంచి ఒకరికి ఉద్యోగం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికీ రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా చికిత్స కు అయ్యే ఖర్చును భరిస్తామంటూ హామీ ఇచ్చారు.అయితే జరిగిన ప్రమాదం అత్యంత దారుణమైనదే, దాదాపు 8 మంది వ్యక్తులు ఆ అగ్నికి సజీవదహనం అవ్వడం బాధాకరమే, వారి మృతుల పట్ల వారి కుటుంబాల పట్ల యావత్ దేశం సానుభూతి వ్యక్తం చేస్తుంది.
కానీ ఇటువంటి సమయంలో వారికీ వారి కుటుంబాలకు కేవలం సానుభూతి మాత్రమే సరిపోదు. మీకు మేమున్నాము, మీ కుటుంబానికి మాది భరోసా, మీ చికిత్స బాధ్యత మాది అంటూ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి వారికీ వారి కుటుంబాలకు ఒక నమ్మకం కలగాలి, అలా కలిగేలా ప్రభుత్వ పెద్దలు నడుచుకోవాలి. ఈ విషయంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సరిగ్గా స్పందించింది.
కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన, పరామర్శ….రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉపముఖ్యమంత్రి పవన్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో సహా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోమ్ మంత్రి అనిత, విశాఖ గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు బాధిత కుటుంబాలను పలకరించారు, క్షగాత్రులను పరామర్శించారు, వారికీ మేమున్నామంటూ ధైర్యం చెప్పారు, భారీ స్థాయిలో ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వం – విపక్షం అనే రాజకీయ వైరాలు కాసేపు పక్కన పెట్టి అందరు మానవత్వంతో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. ఏ ప్రభుత్వాలైనా జరిగిన దారుణాలను మార్చలేవు, కానీ ఒక ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వంగా స్పందించే తీరు దారుణం కాకుండా చూసుకోవాలి.
ఆ విషయంలో కూటమి నూటికి నూరు శాతం సమర్ధవంతంగా పనిచేస్తుంది. కానీ విపక్షంలో ఉన్న వైసీపీ ఇటువంటి ప్రమాద ఘటనలను కూడా రాజకీయం చేస్తూ, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని భావించడం చూస్తుంటే వైసీపీ రాజకీయానికి మానవత్వం కొరవడిందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని, కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరణ చేసేందుకే పరిశ్రమ ను సరిగా పట్టించుకోవడం లేదని, బాధితులకు సరైన నష్ట పరిహారం ప్రకటించలేదంటూ వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు మొదలుపెట్టారు. ప్రతిపక్షంగా వైసీపీ కి ప్రభుత్వం తీసుకునే చర్యల పై సందేహాలు ఉంటే ప్రశ్నించవచ్చు,
అలాగే ప్రభుత్వ చర్యలలో తప్పిదాలు దొర్లితే తప్పుపట్టవచ్చు, లేదా ప్రమాదం జరిగిన అతృఅవత కూడా ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తూ ప్రమాద స్థలికి రాకుండా, బాధితులను పరామర్శించకుండా ఉండుంటే విమర్శించవచ్చు.
కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమి ఇక్కడ కనిపించడం లేదు. అయినా వైసీపీ కేవలం రాజకీయ లబ్ది కోసమే అనుకోని ప్రమాదాన్ని ప్రభుత్వ తప్పిదంగా చిత్రకరించేందుకు తెగ తాపత్రయ పడుతుంది.
అందుకు తగ్గట్టే తన కార్యాచరణ మొదకుపెడుతుంది. జగన్ రేపు విశాఖ పర్యటనకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని ప్రకటించింది వైసీపీ. అయితే జగన్ పరామర్శలు జై జై జగన్ నినాదాలతో, రప్ప రప్ప పోస్టర్లతో, సీఎం సీఎం అనే భజన కార్యక్రమాలతో నిండిపోకుండా ఉంటేనే జగన్ వెళ్లిందా పరామర్శికి అన్న సంగతి అర్ధమవుతుంది.
మరి వైసీపీ క్యాడర్ జగన్ పరామర్శ యాత్రను కూడా ఎన్నికల ప్రచార యాత్రగా మారుస్తారో లేదో అనేది రేపటి రోజున తేలుతుంది..!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…