
“ఏడ్రా మీ అన్నయ్య సౌండ్ లేదు” అని విలన్ అనగానే.. రివర్స్ మోడ్లో చిరుని చూపించిన తీరు, మెగాస్టార్ సిగరెట్ వెలిగించుకుని లైక్, షేర్, సబ్స్క్రయిబ్ చేయండి అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ లుంగీ, మెడలో గొలుసులు, ఎర్ర షూస్ అన్ని ఊర మాస్ లుక్ ని తీసుకొచ్చాయి. చిరు కూడా చాలా స్లిమ్ గా, యంగ్ గా, గ్లామరస్ గా కనిపించారు. ఫాన్స్ ని ముఠామేస్త్రి రోజుల్లోకి తీసుకెళ్లాడు బాబీ.
ఈ టీజర్ చూసినా ఫాన్స్ ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య తో ఎవరు పోటీకి వచ్చినా విజయం మాదే అని ఫిక్స్ అయిపోయారు. టీజర్ చివర్లో రవితేజ వాయిస్ లో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పడం, సంక్రాంతి యుద్ధానికి చిరు కూడా రెడీ అని తెలుపుతుంది. ఏదేమైనా చిరు ఒరిజినల్ మూవీస్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా..దయచేసి రీమేక్ లు వద్దప్ప.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…