
హృతిక్, టైగర్ మధ్య వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే కార్ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చూసినవారు డైలాగ్స్ కొంచెం రొటీన్ గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. సరైన ఎలివేషన్ లేదని వారి ఒపీనియన్. అది అలా ఉంచితే కొందరు బాలీవుడ్ అభిమానులు మాత్రం బాహుబలి 2, సాహూ చిత్రాలను తలదన్నే సినిమా ఇదే అని ఇప్పటికే తొడలు కొడుతున్నారు. ఈ సారి మా సత్తా చూపిస్తాం అంటున్నారు.
సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున చిరంజీవి సైరా కూడా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండంతో వార్ సినిమా వారికి తలపోటుగానే పరిణమించవచ్చని ట్రేడ్ విశ్లేషకుల భావన.
In an industry where towering cutouts are usually associated with male stars, Nayanthara is getting…
The team of 418 expressed happiness over the response to the film, with producers Naveen…