Telugu

వరంగల్‌ విమానాశ్రయం: అల్లుడి పేరు సోమలింగం?

ఇంకా శంకుస్థాపన కూడా జరుగని వరంగల్‌ విమానాశ్రయం పేరు విషయంలో జరుగుతున్న వివాదాలు చూస్తుంటే అదేదో సామెతలో అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు అనిపిస్తుంది.

తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి చొరవ, టీడీపితో పాత పరిచయాలు, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయ సహకారాలతో వరంగల్‌లో మరో రెండేళ్ళలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది.

ADVERTISEMENT

దీనిని సాధించడం కోసం తమ ప్రభుత్వం ఎంతగా కృషి చేసిందో సిఎం రేవంత్‌ రెడ్డి మంత్రులు చెప్పుకొని ఉండి ఉంటే, ప్రజలు కూడా వారి శ్రమ, నిబద్దతను గుర్తించి, భవిష్యత్‌ ఓట్ల రూపంలో అభినందించేవారు.

కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పేరు ఎంపిక చేయాలనే సదుదేశ్యంతో సిఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ విమానాశ్రయానికి తగిన పేరు సూచించాలని విజ్ఞప్తి చేశారు. కానీ అదే ఓ కొత్త వివాదానికి దారి తీసింది.

దీనికి కాకతీయ లేదా రాణీ రుద్రమ పేర్లు పెట్టాలని కొందరు సూచిస్తుంటే, పీవీ నరసింహరావు పేరు పెట్టాలని బిజేపి సూచిస్తోంది. ఇంకా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ వంటి అనేక పేర్లు వినిపిస్తున్నాయి.

నేడు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మేధావుల సమావేశంలో కంచె ఐలయ్య మాట్లాడుతూ, సిఎం రేవంత్‌ రెడ్డి తన మనుమడి పేరు ‘రేయాన్స్ రుద్రదేవ్.’ కనుక ఓ టెర్మినల్‌కు ‘రేచర్ల రుద్రారెడ్డి’ పేరు పెట్టాలని యోచిస్తున్నారని ఆరోపించారు. ఈ విమానాశ్రయానికి కూడా ఇందిరా గాంధీ లేదా రాజీవ్ గాంధీ పేర్లు పెట్టాలనే ఆలోచన కూడా చేయవద్దని హితవు పలికారు. దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో ఇంకా బీఆర్ఎస్‌ పార్టీ జోక్యం చేసుకోలేదు. చేసుకుంటే తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తమ అధినేత కేసీఆర్‌ పేరు పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కనుక అందరికీ ఆమోదయోగ్యమైన పేరుని ఎంపిక చేసే ప్రయత్నం ఈవిధంగా వివాదాస్పదంగా మారింది.

ఈ విమనాశ్రయ నిర్మాణ పనులకు డిసెంబర్‌లో శంఖుస్థాపన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే నెల 9న సోనియా గాంధీ పుట్టిన రోజు. కనుక అదే రోజును చేయాలనుకుంటే అది మరో వివాదంగా మారవచ్చు.

కానీ భోగాపురం వద్ద నిర్మించిన విమానాశ్రయానికి ఏపీ ప్రభుత్వం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు ఖరారు చేసి ప్రకటిస్తే అందరూ దానికి జై కొట్టారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బాలినేని బ్యాక్ టూ హోమ్….?

వైసీపీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ పార్టీ క్యాడర్ కు కూడా అర్ధం కానీ రీతిలో ముందుకెళుతోంది. ఒక…

3 minutes ago

Mohanlal Replaced? Big Downgrade for Ajith’s Film?

Following the commercial success of Good Bad Ugly, Ajith Kumar took a short break and…

12 minutes ago