
2019-2024 నడుమ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నుండి ఎదురైన ప్రతికూల పరిస్థితుల రీత్యా, 2024లో కూటమి ప్రభుత్వ విజయంతో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ మీద తెలుగు చిత్ర పరిశ్రమ గంపెడాశలు పెట్టుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే తనను ఓ టాప్ హీరోగా తీర్చిదిద్దిన చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా సహకరించబోతున్నారు? అనే ప్రశ్నకు సమాధానం యువ నిర్మాతలతో m9 నిర్వహించిన చర్చా వేదికలో బహిర్గతం అయ్యింది.
m9 నిర్వహించిన వేదికపై నిర్మాత బన్నీ వాస్ నాటి విశేషాలను క్లుప్తంగా వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న టికెట్ ధరలపై అడిగిన ప్రశ్నకు బదులుగా…
ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారని, ప్రతిసారి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటూ అటు ఇటు తిరిగే బదులు ఒక కమిషన్ గానీ, ఒక కమిటీ గానీ ఏర్పాటు చేసి సరళీకృతంగా ఉండే విధంగా సినిమా టికెట్ ధరలను తీసుకువస్తే సరిపోతుందని సలహా ఇచ్చారని, దీనిపై ఇంకా ఛాంబర్ నిర్ణయం తీసుకోలేదని, నిజానికి రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, కానీ మా వద్దే లేటవుతుందని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.
యుఎస్ లో మాదిరి వీకెండ్స్ లో ఓ టికెట్ ధర, వీక్ డేస్ లో ఇంకాస్త తక్కువగా టికెట్ ధరలు ఉంటాయని, ముంబై, బెంగళూరు వంటి నగరాలలో ఇప్పటికే ఈ సిస్టం అమలవుతుందని, ఈ తరహా విధానాన్ని రూపకల్పన చేయాలన్నట్లుగా పవన్ కళ్యాణ్ సూచించారని, ఛాంబర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని బన్నీ వాస్ తెలిపారు.
ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, ఇంకా తెలుగు సినీ పరిశ్రమ ఆ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడం అనేది చిత్ర పరిశ్రమలో ఉన్న లుకలుకలను తేటతెల్లం చేస్తుందా?
ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణా సర్కార్ కూడా ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట బహుమతులను అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒకటికి రెండు సార్లు ప్రకటన చేసినప్పటికీ టాలీవుడ్ నుండి స్పందన కరువైన విషయం తెలిసిందే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రభుత్వాలతో నిర్లక్ష్య వైఖరి అవలంబించి చివరికి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…