Telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇదేం ట్విస్ట్… పాపం ట్రంప్‌!

ఈ ఏడాది నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (డెమొక్రాట్), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (రిపబ్లికన్) ఇద్దరూ మళ్ళీ ఈ ఎన్నికలలో పోటీ పడుతున్నారు.

ADVERTISEMENT

అయితే జో బైడెన్ వృద్ధాప్యం కారణంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేకపోవడం, తడబడుతుండటం, వేదికలపై అయోమయంగా నిలబడిపోతుండటం చూసి డెమొక్రాట్ పార్టీ చాలా ఆందోళన చెందుతుండేది.

బైడెన్ తడబడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయమనే అందరూ అనుకుంటున్నారు.

అయితే జో బైడెన్ ఒక్క నిర్ణయంతో అంతా తారుమారు అయ్యింది. ఆయన బేషజానికి పోకుండా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కమలా హారిస్‌కు మద్దతు తెలిపి తన స్థానంలో ఆమెను బరిలో దింపారు.

ఇంతకాలం బైడెన్ బలహీనత కారణంగానే డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ హటాత్తుగా కమలా హారిస్ బరిలో దిగడంతో డొనాల్డ్ ట్రంప్‌ షాక్ అయ్యారు.

ఆమె చాలా బలమైన మహిళా అభ్యర్ధి. కనుక ఆమె గెలిస్తే అమెరికా చరిత్రలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు అవుతారు. అంత అత్యున్నత స్థానానికి తనకు అవకాశం కల్పించి తమ డెమొక్రాట్ పార్టీ మహిళా సాధికారతని చాటిందంటూ ఆమె చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.

‘సర్వశక్తివంతమైన అమెరికాకు తొలి మహిళా ప్రెసిడెంట్’ అనే మాట అమెరికన్లను చాలా ఆకట్టుకుంటోంది.

ఆమె భారతీయ మూలాలున్న మహిళా కావడంతో అమెరికాలో స్థిరపడిన భారతీయులందరూ ఆమెకు మద్దతు ఇస్తారు. ఇది కూడా ఆమెకు బాగా కలిసివస్తోంది.

ఊహించని ఈ పరిణామంతో షాక్ అయిన ట్రంప్‌ అలవాటులో పొరపాటుగా ‘ఆమె అమెరికా అధ్యక్ష పదవికి అనర్హురాలు… ఆ బాధ్యతలు సమర్ధంగా నిర్వర్తించలేరంటూ’ డొనాల్డ్ ట్రంప్‌ నోరు జారారు. ఇది కూడా ఆమెకు బాగా కలిసి వచ్చింది.

డొనాల్డ్ ట్రంప్‌ అక్రమ సంబంధాలు, మహిళల పట్ల చులకన భావం గురించి ప్రస్తావిస్తూ కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక విషయంలో రెండు పార్టీలు చాలా వడపోతల తర్వాత అభ్యర్ధులను ఖరారు చేస్తుంటాయి. కానీ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నందునే డెమొక్రాట్ పార్టీ మళ్ళీ ఆయనకు మొగ్గు చూపిందా లేక డొనాల్డ్ ట్రంప్‌ని వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకే ఇంతకాలం బైడెన్‌తో కధ నడిపించి, ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడు హటాత్తుగా ఆయన స్థానంలో కమలా హారిస్‌ను బరిలో దించిందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏది ఏమైన్నప్పటికీ కమలా హ్యారిస్ ఎంట్రీతో డొనాల్డ్ ట్రంప్‌ విజయావకాశాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

ఈ 10 డీఎస్సీ కాదు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే!

జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…

8 minutes ago

Is Rashmika Mandanna India’s No. 1 Actress?

Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…

36 minutes ago