
మరో రెండు వారాల్లో 2025 పాత సంవత్సరంగా మారిపోతుంది. కనుక చాలా మంది కొత్త సంవత్సరం కోసం కొత్త నిర్ణయాల జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. వారిలో చాలా మంది జనవరి రెండో వారానికే వాటి సంగతి మరిచిపోయి మళ్లీ రొటీన్‌లో పడిపోతారు. ఇది మానవ సహజం.
అయితే ఈ ఏడాది నుంచి మనం ఏం తీసుకెళ్ళాలి? ఇక్కడే వదిలేయాల్సినవి ఏమిటి? అని కూడా ఆలోచించాల్సిన సమయం ఇదే.
కొత్త సంవత్సరమంటే కేవలం క్యాలెండర్ మార్చడం మాత్రమే కాదు. మన ఆలోచనల్లో, అలవాట్లలో గల లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఇదో ‘ఇయర్లీ రిమైండర్’ అని భావించవచ్చు.
ఈ సంవత్సరం చివర్లో ముందుగా వదిలేయాల్సినవి కొన్ని ఉన్నాయి. చాలా మంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. ఇది మన వల్ల కాదు. మనం ఏం చేసినా అందరూ చూస్తుంటారు. అందరూ మనల్నే గమనిస్తుంటారు. కనుక కొత్తగా ప్రయత్నించి అభాసుపాలవడం మంచిది కాదని చాలా మంది అనుకుంటారు.
కానీ నిజానికి ప్రయత్నించకపోవడమే పెద్ద తప్పు. ఆ ప్రయత్నంలో ఎదురుదెబ్బ తగిలినా, నలుగురూ నవ్వినా కొత్త విషయాలు తెలుస్తాయి. మళ్లీ మరో తప్పు చేయకుండా ఈ విఫలయత్నమే ఓ గుణపాఠంగా ఉపయోగపడుతుంది. అదే మనం సరైన దిశలో ముందుకు సాగడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక అందరూ మనల్నే గమనిస్తుంటారు, మన గురించే ఆలోచిస్తుంటారనే భావన కూడా చాలా తప్పు. ఈ లోకంలో అటువంటివారే చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, అందరికీ మన గురించే ఆలోచించే తీరిక, అవసరం ఉండవు. కనుక ఎవరో ఏదో అనుకుంటారని ప్రయత్నం చేయకపోతే మన కంటే అందరూ ముందుకు వెళ్ళిపోతారు. మనం ఉన్నచోటనే ఉండిపోతాము.
ఇతరుల విజయాలతో మనం స్పూర్తి పొందాలి తప్ప వాటితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు.
అదే సమయంలో ఇతరుల వైఫల్యాలు, ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు చూసి నవ్వకూడదు. కానీ వాటిని కూడా మనం పాఠాలుగా స్వీకరించాలి. ఎందుకంటే ప్రతీదీ మన స్వీయ అనుభవం, కష్టం, నష్టంతోనే నేర్చుకోవలసిన అవసరం లేదు. ముందుకు సాగడంలో ఈ పద్ధతి కూడా మంచిదే.
చివరిగా ఒక మాట. మన జీవితానికి మన విజయాలు మాత్రమే కొలమానం. మన అపజయాలు తదుపరి విజయానికి కేవలం మెట్లు మాత్రమే అని దృఢంగా అనుకుంటే, మన ఆలోచన తీరులో కూడా మార్పు వస్తుంది.
ఉద్యోగాల కల్పన అంటే నెలకు రూ.5,000 జీతంతో వాలంటీర్లు నియమించుకొని పార్టీ కోసం పని చేయించుకోవడమా? లేక పోలీస్, విద్యా…
The TFTDDA power struggle has taken a serious legal turn. A court has stopped the…