Telugu

తప్పులేదు… పవన్ శీలాన్ని శంకించవచ్చు..!

Who is behind pawan kalyan Jana Sena partyమొన్నటివరకు తనను చంద్రబాబు మనిషి అన్నారని, ఇప్పుడేమో బిజెపి మనిషి అంటున్నారని, కానీ తాను మాత్రం ప్రజా శ్రేయస్సు కాంక్షించే మనిషినని, తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని పవన్ చెప్తోన్నా… అది నమ్మశక్యంగా ఉండడం లేదు. ఎందుకంటే పవన్ చేస్తోన్న పనులకు, చెప్తోన్న మాటలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే పవన్, సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న సమయంలోనే బయటకు వచ్చి విమర్శలు చేస్తుండడం… పవన్ వ్యవహారశైలిని మరింత అనుమానపరిచేలా చేస్తోంది.

ADVERTISEMENT

గడిచిన నాలుగు సంవత్సరాలలో ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదని అందరికీ తెలిసిందే. కానీ ఇన్నాళ్ళుగా తమతో ఉన్న టిడిపి సైలెంట్ గా ఉండడంతో బిజెపి మనుగడ సాగిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు తిరుగుబావుటా ఎగురవేయడంతో పాటు, పార్లమెంట్ ను స్తంభించేలా ప్రతిపక్షాలు కూడా దోహదం చేయడంతో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో మోడీ ఉన్నారన్నది వాస్తవం. సరిగ్గా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ ఎంటరై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, బిజెపికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండడం అనేది పవన్ నుండి ఊహించినది కాదు.

నిజంగా చంద్రబాబుపై విమర్శలు చేయాలనుకుంటే, మరో ఒకటి, రెండు నెలలు ఆగి చేసి ఉండవచ్చు. నాలుగేళ్ళుగా సినిమాలు చేసుకుంటూ రాజకీయాలను పట్టించుకోని పవన్, మరో రెండు నెలలు ఆగితే, రాష్ట్రానికి గానీ, జనసేనకు గానీ పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు చంద్రబాబుపై మండిపడడం వలన మొత్తం ‘స్పెషల్ స్టేటస్’ అంశం పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది. పరోక్షంగా ఇది ప్రధాని మోడీపై ఉన్న ఒత్తిడిని తగ్గించడమే అవుతుంది. తాజాగా ఎన్డీఏ నుండి బయటకు వచ్చి, బిజెపి వ్యతిరేక శక్తులన్నింటినీ చంద్రబాబు ఒక్కతాటి పైకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంటే… పవన్ మాత్రం జాతీయ మీడియాలో చంద్రబాబును కించపరుస్తూ మాట్లాడడం శోచనీయం.

విమర్శలకు కూడా ఓ సమయం, సందర్భం ఉండాలి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తే నవ్వుల పాలు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏపీ హక్కుల కోసం ఢిల్లీలో తీవ్రంగా పోరాడుతున్న వేళ… దానిని డైవర్ట్ చేస్తూ పవన్ వ్యాఖ్యలు చేస్తుండడం… పవన్ శీలాన్ని శంకించేలా చేస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే… ఖచ్చితంగా పవన్ వెనుక బిజెపి ఉందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. ఇప్పటివరకు లోకల్ మీడియాతో కూడా మాట్లాడని పవన్, హఠాత్తుగా నేషనల్ మీడియాలో కూడా దంచి కొట్టడం… అబ్బో… పవన్ కు రాజకీయాలు అంచనాలు వేసిన దాని కంటే ఫాస్ట్ గానే అబ్బినట్లుగా కనపడుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

2 hours ago

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

6 hours ago