
ఇండస్ట్రీ అంటేనే అంత… ఇక్కడ ఒకరికి హిట్ పడితే మిగతా అందరూ మూకుమ్మడిగా ఏడుస్తారు… అలాగే ప్లాప్ వస్తే సెలెబ్రేట్ చేసుకోవడానికి కారణాలు అవసరం లేదు.
అయితే గుంటూరుకారం రిజల్ట్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఒక దర్శకుడికి ఒకటి కంటే ఎక్కువే కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.
సదరు డైరెక్టర్ నిన్న నర్మగర్భంగా ఒక ట్వీట్ వేశాడు. తనదైన శైలిలో ఇండస్ట్రీలో దొరికేసిన ఒక శుక్రవారం పై బ్రేక్ డాన్స్ వేసినట్టు ఉంది ఆ ట్వీట్… అర్ధమైన వాళ్ళకు అర్ధమైతే చాలు అన్నట్టు ఆ ట్వీట్ కి కామెంట్స్ ఆపేశాడు ఆ దర్శకుడు.
ఆ ట్వీట్ గుంటూరుకారం ని ఉద్దేశించే అని ఇండస్ట్రీ కి స్పష్టం అయితే టార్గెట్ ఎవరు అనేదాని మీద రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి.
తన కెరీర్ కి ఎంతో అవసరం అనుకునే ఒక ప్రాజెక్ట్ జీడీ పాకం లా అనంతంగా సాగిపోవడానికి త్రివిక్రమే కారణం అని ఆ డైరెక్టర్ ఉద్దేశం అని పుకారు. తన సినిమా ముందుకు సాగకుండా మధ్యలో వేరే వారిని త్రివిక్రమ్ ఇరికించాడని ఆయన ఉద్దేశం.
ఇక ఆ డైరెక్టర్ కి త్రివిక్రమ్ తోనే ప్రాబ్లమా అంటే కాదు…
ఒకానొక చోట ఆ దర్శకుడు గురించి మహేష్ చాలా తక్కువగా మాట్లాడి జోక్ చేశాడట. చాలా మంది ముందు అవమానకరంగా మాట్లాడడంతో ఈ సందర్భాన్ని వాడుకున్నాడని ఇంకొంత మంది అంటారు.
ఒకరకంగా ఒకే దెబ్బకు రెండు పర్పస్లు పూర్తి అయిపోయాయి.
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…
Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…