Telugu

పజిల్ : ఈ సెటిల్మెంట్ వైసీపీ ఎంపీ ఎవరో?

ఏపీలోని అధికార పార్టీ నేతల తీరుతెన్నులు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా ఓ వైసీపీ ఎంపీ చేరారంటూ ప్రముఖ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ సంచలన కధనం ప్రసారం చేసింది. సదరు ఎంపీ పేరు ఏమిటో బయటకు ప్రస్తావించకుండా సాగిన కధనంలో సారాంశం ఏమిటంటే…

నిత్యం వివాదాలతో మునిగిపోయే రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీ, ఓ దళిత మహిళతో సెటిల్మెంట్ వ్యవహారం నడిపారట! గతంలో పోలీస్ శాఖలో ఈ వైసీపీ ఎంపీ పనిచేసినట్లుగా, ఆ సమయంలో ఓ హత్యాచార కేసు నమోదు కాగా, సదరు కేసు కోర్టు పరిధిలో చేరింది.

ADVERTISEMENT

తుది దశకు చేరుకున్న ఈ కేసు ఎంపీ గారి మెడకు చుట్టుకుంటుందేమో అన్న భయంతో, సదరు దళిత మహిళతో సెటిల్మెంట్ చేయాల్సిందిగా గతంలో తనతో పని చేసిన ఖాకీ మిత్రులను రంగంలోకి దించారట. విజయవాడ వేదికగా అక్టోబర్ మాసంలో ఈ సెటిల్మెంట్ వ్యవహారం జరిగినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు.

విజయవాడకు చెందిన సిఐ, స్పెషల్ బ్రాంచ్ కు చెందిన మరో సిఐ, లా అండ్ ఆర్డర్ సిఐలు కలిసి విజయవాడలోని ఓ హోటల్ లోని రూమ్ నెంబర్ 205కు బాధిత కుటుంబాన్ని పిలిపించి, కొన్ని గంటల పాటు భయపెట్టి, ఫైనల్ గా 5 లక్షల రూపాయలకు సెటిల్ చేసినట్లుగా ఈ కధనంలో ప్రసారం చేసారు.

ఎంపీ గారి సమక్షంలో సెటిల్ అయిన మొత్తం 5 లక్షల డబ్బులు తన దగ్గర లేవని ఎంపీ చెప్పడంతో, చివరకు పోలీస్ అధికారులే ఆ 5 లక్షలను అప్పటికప్పుడు సర్దుబాటు చేసి బాధిత కుటుంబానికి ఇచ్చినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు. ఇద్దరు పోలీస్ అధికారులు 2 లక్షల చొప్పున, ఓ పోలీస్ అధికారి ఒక లక్ష రూపాయలు, మొత్తంగా 5 లక్షలు ఇచ్చి ఈ కధకు శుభంకార్డు వేసినట్లుగా ప్రసారం చేసిన ఈ కధనం పొలిటికల్ అండ్ పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఈ కధనాన్ని టిడిపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఎంపీ పేరు ఎవరో చెప్పాలంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోకు రిప్లైలు ఇచ్చే పనిలో ఉన్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ అధికారిక వైసీపీ ఎంపీ ఎవరంటారు? మీకేమైనా తెలిస్తే మీరు కూడా తెలియజేయవచ్చు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Is A Story That Lives Within Us: Ranbir

The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…

6 hours ago

Bloody Romeo: Sujeeth’s Presentation of Nani Most Crucial

Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…

7 hours ago