Telugu

కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కేదెవరికో?

కేంద్రంలో ఏర్పడబోతున్న ఎన్డీయే ప్రభుత్వంలో ఈసారి టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. కనుక కనీసం 3-4 కేంద్రమంత్రి పదవులు, లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఎన్డీయేలో బీజేపీకి 240 మంది ఎంపీలు, ఇంకా జేడీయూ (బిహార్‌), శివసేన (మహారాష్ట్ర) మరికొన్ని పార్టీలు కూడా ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి.

ADVERTISEMENT

ఈసారి ఎన్డీయే కూటమి బొటాబోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుండటంతో 16 మంది జేడీయూ ఎంపీల మద్దతు చాలా కీలకంగా మారింది. కనుక నితీశ్ కుమార్‌ తమ పార్టీకి ఎక్కువ కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టవచ్చు.

టిడిపి 16, జనసేన ఇద్దరు ఎంపీలు కలిపి మొత్తం 18 ఎంపీలతో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు పట్టువిడుపులుకు సిద్దంగా ఉంటారు కనుక ప్రధాని మోడీ టిడిపికి రెండు కేంద్రమంత్రి పదవులతో సరిపెట్టవచ్చు.

కనుక ఆ రెండు లేదా మూడు పదవులు ఏపీ టిడిపి ఎంపీలలో ఎవరికి దక్కే అవకాశం ఉందని ఆలోచిస్తే, ఖచ్చితంగా వాటిలో ఒకటి కింజారపు రామ్మోహన్ నాయుడికి దక్కే అవకాశం ఉంటుంది.

మరో పదవి సిఎం రమేష్ (అనకాపల్లి), భరత్ (విశాఖ), కేశినేని చిన్ని (విజయవాడ), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసారావుపేట ), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు)లలో ఎవరో ఒకరికి దక్కే అవకాశం ఉండవచ్చు.

ఇక రాష్ట్రంలో టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కనుక ఈసారి టిడిపితో పాటు జనసేన, బీజేపీలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నాయి.

మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌కి మొదట పార్టీ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నప్పటికీ మంత్రివర్గంలో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రులు కింజారాపు అచ్చన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నారాయణ, గంటా శ్రీనివాస రావు తదితరులందరికీ మళ్ళీ మంత్రి పదవులు ఖాయమే అని భావించవచ్చు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, ధూళిపాళ నరేంద్ర, కన్నా లక్ష్మినారాయణ, బోండా ఉమా మహేశ్వర రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వంగలపూడి అనిత, బేబీ నాయిన వంటి పలువురు సీనియర్లు మంత్రి పదవులకు అర్హులే.

ఈసారి పొత్తులలో భాగంగా సీట్ల సర్దుబాట్లలో జనసేన వెనక్కు తగ్గి అనేక త్యాగాలు చేయడమే కాకుండా ఈసారి పోటీ చేసిన 21 సీట్లు గెలుచుకున్నందున జనసేన కూడా మంత్రి పదవులు ఆశించడం సహజమే.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆ పార్టీలో మరో ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది.

బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నందున ఆ పార్టీలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వక తప్పదు. కనుక ఈసారి మంత్రివర్గం కూర్పు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

11 minutes ago

స్థానికం నేర్పిస్తున్న కొత్త పాఠాలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…

32 minutes ago