
ఏపీలో టీడీపి-జనసేనలు పొత్తుకి సిద్ధమవుతున్నప్పుడు, 175/175 సీట్లు మాకేనని బల్లగుద్ది వాదిస్తున్న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఆందోళన చెందారు. ఆ రెండు పార్టీలు చేతులు కలిపితేనే తమ కొంప మునుగుతుందని భయపడిన జగన్, ఆ రెండు పార్టీలు వెళ్ళి బిజేపితో పొత్తు పెట్టుకోవడంతో షాక్ అయ్యారు.
వైసీపీ ఓడిపోతుందని గ్రహించగానే, ఎన్నికలలో కేంద్రం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించడం మొదలుపెట్టారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని జరిగితే మాదే గెలుపు అని చెప్పుకొని బాధపడేవారు.
అంటే ఎన్నికలకు ముందే జగన్ ఓటమి అంగీకరించేశారన్న మాట! ఆయన భయపడినట్లే 175/175కి బదులు (ఈవీఎంల కారణంగా) 175/11తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే.
అయితే ఏపీలో ఇంత ‘సక్సస్‌ఫుల్ కాంబినేషన్’ని తెలంగాణ బిజేపి నేతలు ఎందుకు వద్దనుకుంటున్నారు? అనే సందేహం కలుగుతుంది.
తెలంగాణలో ‘తెలంగాణ సెంటిమెంట్’ బలంగా ఉండటం, ఆ కారణంగా ఆంధ్రా డెప్యూటీ సిఎం రాజముద్ర కలిగిన పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపితే ప్రజలలో సెంటిమెంట్ పెరిగి బీఆర్ఎస్ పార్టీ వైపుకి వెళ్ళిపోతారనే భయం కావచ్చు. లేదా తెలంగాణ బిజేపి నాయకులందరికీ అతివిశ్వాసం బాగా ఎక్కువ కనుక జనసేనతో పొత్తులు, పవన్ కళ్యాణ్ అవసరం తమకు లేదన్నట్లు మాట్లాడుతుండవచ్చు.
ఇక జనసేన విషయానికి వస్తే తెలంగాణలో ప్రవేశానికి దానికి ఈ సెంటిమెంట్ పెద్ద అడ్డుగోడగా నిలుస్తోంది. కనుక అది ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. తెలంగాణలో కలిసి పనిచేయగల అవకాశం ఉన్న ఏకైక పార్టీ బిజేపి మాత్రమే. కానీ అది జనసేనతో పొత్తు వద్దనుకుంటోంది. కనుక బిజేపి, జనసేన రెండు పార్టీలు కూడా నష్టపోతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల విషయంలో ఢిల్లీలోని బిజేపి పెద్దలు నేటికీ గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తుండటం తెలంగాణ బిజేపికి శాపంగా మారిందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ బిజేపి, జనసేనలు చేతులు కలిపితే సెంటిమెంట్ గోడని బద్దలు చేయలేకపోయినా చేధించే మార్గం కనిపించవచ్చు.
కానీ నిజామాబాద్ బిజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ వంటి సీనియర్ నేతలు అహంభావంతో పవన్ కళ్యాణ్ అవసరమే మాకు లేదంటూ గీరగా మాట్లాడుతున్నారు. ఈ అహంభావమే కేసీఆర్ అంతటివాడిని ఫామ్‌హౌసులో కూర్చోబెట్టిందని గ్రహిస్తే మంచిది. లేకుంటే తెలంగాణలో బిజేపి ఎప్పటికీ మూడు, నాలుగు స్థానాలలోనే కాలక్షేపం చేయక తప్పదు.
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…