
పెళ్ళి ఓ బంగారు పంజరం వంటిది. లోపలున్న పక్షులు ఆ చెర నుంచి బయటపడితే స్వేచ్చగా, సుఖంగా తమకు నచ్చినట్లు బతకవచ్చనుకుంటాయి. అలాగని ఇది అందరికీ వర్తించదు. కానీ చాలా మందికి వర్తిస్తుంది.
ఇందుకోసం కొందరు తమ పని లేదా వృత్తిలో ఆనందం వెతుకుంటారు. కొందరు స్నేహితులలో సంతోషం వెతుక్కుంటారు. కొందరు అక్రమ సంబంధాలతో, వ్యసనాలతో రకరకాలుగా సంతోషం కోసం వెతుకుంటారు.
దాంపత్య జీవితం ఆ సంతోషాన్ని కూడా మింగేసినప్పుడు విడాకులు, ఇంకా భరించలేకపోతే హత్యలు, ఆత్మహత్యలు వరకు కూడా వెళుతుంటాయి.
దీనర్ధం ప్రపంచంలో భార్యాభార్తలందరూ ఇలాగే అష్టకష్టాలు పడుతున్నారని కాదు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతీరోజూ ఇలాంటి వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి కదా? సమాజంలో, సమాజ ఆలోచనా ధోరణిలో ఈ మార్పుకి కారణం ఏమిటి? అని ఆలోచిస్తే కుటుంబంలో ఎవరూ నచ్చకపోవడం. మా ఇరువురి మద్య మూడో వ్యక్తికి ముఖ్యంగా పెద్దలు వద్దనుకునే ధోరణి కొన్ని కారణాలుగా కనిపిస్తాయి.
సంపాదన, పని, కుటుంబ భారం, ప్రైవసీ, మొబైల్ ఫోన్, అనేక కోర్కెలు, వాటి కారణంగా ఈఎంఐలు, ఆ ఒత్తిళ్ళు వంటి ఇంకా అనేక కారణాలు కూడా ఉండవచ్చు.
అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా? అంటే ఉంది. కానీ ముందుగా భార్యభర్తలు ఒకరితో మరొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం, ఎదుటవారు దానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే అన్నీ కాకపోయినా కొన్ని సమస్యలు తప్పకుండా పరిష్కరించుకోవచ్చు. కానీ దీని కోసం పెద్ద కసరత్తే చేయాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు, రోజూ కాస్త వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ చాలా మంది చేయక అనారోగ్యం పాలవుతుంటారు. అలాగే భార్యాభర్తల మద్య సమస్యలు పరిష్కరించుకొని సుఖంగా, సంతోషంగా జీవించాలంటే ముందుగా ఇగో, కోపం, అసూయ, ద్వేషం వంటివన్నీ పక్కన పెట్టగలగాలి. కానీ చాలా మంది వ్యాయామం చేయడానికి ఇష్టపడనట్లే, ఇలాంటి కసరత్తు చేయడానికి కూడా ఇష్టపడరు. అందువల్లే ప్రతీరోజూ ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి.
భార్యాభర్తల మద్య ఏర్పడే అన్ని సమస్యలను కాకపోయినా కొన్నిటిని పరిష్కరించుకోగలిగినా, ఈఎంఐల భారం తగ్గితే ఏవిధంగా గొప్ప రిలీఫ్ పొందుతామో అలాంటి రిలీఫ్ లభిస్తుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…