
ఈమధ్యకాలంలో మన తెలుగు హీరోలు పర్సనాలిటీ రైట్స్ తీసుకోవడం కామన్ అయిపోతుంది. నటీనటులు వారి వ్యక్తిగత హక్కులు మాత్రమే కాక తాము నటించే సినిమాలకి కూడా ఈ తరహా రైట్స్ తీసుకొంటుండడం చూస్తున్నాం. గతంలో “మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు” రీసెంట్ గా “పెద్ది” సినిమాకి కూడా ఈ తరహా రైట్స్ తీసుకున్నారు.
రీసెంట్ గా టాలీవుడ్ హీరోల్లో నాగచైతన్య కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ తీసుకున్నాడు. ఇకమీదట నాగచైతన్య ఫోటోలు, వీడియోలు, పేరు కూడా తప్పు విధంగా వాడితే క్రిమినల్ కేస్ వేసే అధికారం నాగచైతన్య లీగల్ టీమ్ కి ఉంటుంది. AI జనరేటెడ్ ఫోటోలు, వీడియోలకు కూడా ఇది వర్తిస్తుంది. సోషల్ మీడియా ట్రోలింగ్ & మార్ఫింగ్ చేసి మరీ చేసే చెడు ప్రచారం నుండి తప్పించుకోవడం కోసమే ఈ విధంగా ఢిల్లీ హైకోర్టు నుండి పర్సనాలిటీ రైట్స్ తెచ్చుకుంటున్నారు స్టార్ హీరోలు. అయితే.. ట్రోలర్స్ ఇంతకంటే తెలివైనవాళ్ళు, డైరెక్ట్ గా పేరు వాడకుండా, ఇండైరెక్ట్ గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
ఈ ఇంటరిమ్ రైట్స్ తీసుకోవడం అనేది సోషల్ మీడియా ట్రోలింగ్ వరకు అడ్డుకుంటుంది సరే, సమాజంలో జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని, సినిమాల రిజల్ట్స్ ని ఏం కంట్రోల్ చేస్తుంది. సో, ఈ రైట్స్ అనేది కేవలం సదరు యాక్టర్ల సంతృప్తి కోసం మాత్రమే.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…