పవన్ అభిమానుల సంబరం… ఎందుకు చేసుకుంటున్నారు?

why pawan kalyan fans celebratingఅప్పుడెప్పుడో తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ చివరి సారిగా అభిమానులకు కనిపించాడు. అయితే ప్రచారం పూర్తి కాకుండానే కరోనా అంటూ హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. ఆ తరువాత మంచం మీద ఉన్న ఒక్క ఫోటో తప్ప పవన్ గురించి అలికిడి లేదు.

సెకండ్ వేవ్ కారణంగా సినిమాల షూటింగులు ఎలాగూ లేవు…ఈ రెండు మూడు నెలల్లో రాజకీయ కార్యక్రమాలు కూడా ఏవీ చెప్పటింది లేదు. మిగతా పార్టీల లాగా ఆన్ లైన్ సమావేశలు కూడా లేవు. జనసేన పార్టీ తిరుపతి ఉపఎన్నిక ఘోర పరాజయం తరువాత పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది.

ADVERTISEMENT

మరోవైపు… ఈ నెల 11 నుండి పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. ఇన్ని రోజులుగా మాయం అయిపోయి సడన్ గా సినిమాలు అంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజకీయాలలో ఒక హాజరు వేయించేసుకుని షూటింగ్ మొదలుపెడతారట. రేపు, ఎల్లుండి నిరుద్యోగ యువతతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశాలు అవుతారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మంచిదే కానీ ఆ కార్యక్రమం ముగించుకుని సినిమా షూటింగులలో బిజీ అయిపోతారు. సహజంగా రాజకీయాల మీద పార్టీ మీద ఎక్కువ దృష్టిపెట్టాలని కోరుకోవాల్సిన అభిమానులు అదంతా మర్చిపోయి తమ అభిమాన నటుడిని చూసుకోవచ్చని సంబరపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అర్ధమయ్యే అభిమానులు మాత్రం తమ అభిమాన నాయకుడి సీరియస్ నెస్ లేని రాజకీయాలకు చింతిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories