
అయితే అసలు విషయం ఏమిటంటే… ఈ ‘ఫోర్బ్స్’ జాబితాలో పేరు పబ్లిష్ కావాలంటే ఆయా హీరోలు ‘ఎన్ఓసి’ ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అందరి సెలబ్రిటీలను ఫోర్బ్స్ ఈ ‘ఎన్ఓసి’ అడుగుతుంటుంది. అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘ఎన్ఓసి’ ఇవ్వకపోవడంతో అసలు పవన్ పేరును పరిశీలనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అందుకనే టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో పవర్ స్టార్ కు అవకాశం దక్కలేదన్నది అసలు వాస్తవం. అయితే ‘ఎన్ఓసి’ సమర్పించిన అందరి హీరోలకు ‘ఫోర్బ్స్’ జాబితాలో అవకాశం దక్కుతుందా అంటే…
ఆ రేంజ్ లో ‘ఫేం, ఆదాయం’ ఉండాలి మరి. పవర్ స్టార్ కు ‘ఆదాయం’ విషయంలో మిగతా హీరోల కంటే కాస్త వెనుకబడి ఉన్నా, ‘ఫేం’ విషయంలో మాత్రం ముందు వరుసలోనే ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ కారణం తెలుసుకున్న తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త స్థిమితపడ్డారు. తన పేరును పబ్లిష్ కావడానికి స్వయంగా పవన్ కళ్యాణే ఆసక్తి చూపకపోవడం వలనే ‘ఫోర్బ్స్’ టాప్ 100లో చోటు దక్కలేదు గానీ, అదే పవన్ కూడా ‘ఎన్ఓసి’ ఇచ్చినట్లయితే, ఖచ్చితంగా టాప్ 100లో ఉండేవారని అభిమానులు చెప్తున్న మాట.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…