
ఒక్కో తరంలో జీవనశైలి, ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. ప్రతీ తరంలో మంచి చెడులు ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి కూడా.
ఈ తరం ఆలోచనా విధానానికి ఓ చిన్న ఉదాహరణ ఇది . నిన్న ముంబాయిలో ‘యాపిల్ ఐఫోన్ 17’ విడుదలైంది. దీని ఖరీదు రూ.1.50 లక్షలు పైమాటే!
అవేమీ కరోనా వ్యాక్సిన్లు కావు. పైగా వాటిని ఉచితంగా పంచి పెట్టడం లేదు. కనీసం వాటిపై డిస్కౌంట్ కూడా ఇవ్వడం లేదు. కానీ ఐ ఫోన్ కొనేందుకు యాపిల్ స్టోర్ ముందు వందలాది మంది క్యూకట్టారు. క్రమంగా క్యూలైన్ పెరిగిపోవడంతో ఆవేవో కరోనా వ్యాక్సిన్స్ అన్నట్లు.. వాటిని దక్కించుకోకపోతే తమ ప్రాణాలు నిలవవన్నట్లు కొట్టుకున్నారు. మొదటి రోజు సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో కొట్టుకునేవారికీ, లక్షన్నర పెట్టి ఐ ఫోన్ కొంటున్నవారికీ తేడా ఏముంది?
దేనికీ ఆరాటం? అంటే సమాధానం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ‘అంత ఖరీదైన ఐ ఫోన్ అందరి కంటే ముందు నేనే కొన్నాను… నా దగ్గర మాత్రమే ఉంది. కనుక మీ అందరి కంటే నేనే చాలా గొప్ప’ అని చెప్పుకోవాలనే తాపత్రయమే! కొన్న వెంటనే ఆ ఫోన్లని యాక్టివేట్ చేసి వాటితో సెల్ఫీలు తీసి అందరికీ పంపించడమే ఇందుకు నిదర్శనం.
కానీ దీని వలన కలిగే ఆనందం, సంతృప్తి రెండూ తాత్కాలికమే. కనుక రేపు ‘యాపిల్ ఐఫోన్ 18, ఆ తర్వాత 25, 75 వెర్షన్స్ విడుదలైనప్పుడూ ఇలాగే పరుగులు తీయక తప్పదు.
మారిన సమాజపు పోకడలు, ఆలోచనలు, బలహీనతలను వ్యాపార సంస్థలు పసిగట్టి తెలివిగా వాడుకుంటూ ఫలానా ప్రోడక్ట్ కలిగి ఉండటం చాలా గొప్ప విషయమన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, బాగా చదువుకున్నవారు, చాలా తెలివైనవారు కూడా ఆ మాయలో ఇలా చిక్కుకోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది… కదా?
BOTTOM LINE A Rooted Small-Town Take On the Tatkal Scam PLATFORM Amazon MX Player RUNTIME…
Allu Arjun has been among the most consistent stars in Indian cinema when it comes…